ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాతో మహిళలకు ప్రమాదం తక్కువ

ABN, First Publish Date - 2020-03-28T05:50:42+05:30

పురుషులు, స్త్రీల విషయంలో కరోనా వైరస్‌ వ్యాప్తి, మరణాలకు సంబంధించి వ్యత్యాసాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్యను విశ్లేషిస్తే పురుషుల కంటే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పురుషులు, స్త్రీల విషయంలో కరోనా వైరస్‌ వ్యాప్తి, మరణాలకు సంబంధించి వ్యత్యాసాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్యను విశ్లేషిస్తే పురుషుల కంటే మహిళల్లో కరోనా బారినపడేవారి సంఖ్య తక్కువగా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. కరోనా వచ్చిన తొలిదేశం చైనాలో మొత్తం మరణాల్లో 2.8 శాతం మంది పురుషులుంటే, మహిళలు 1.7 శాతం మాత్రమే ఉన్నారు. కరోనా వల్ల విలవిల్లాడుతున్న ఇటలీ, స్పెయిన్‌, జర్మనీ, ఫ్రాన్స్‌, ఇరాన్‌, దక్షిణ కొరియా దేశాల్లో కూడా ఇదే ధోరణిలో కరోనా వ్యాప్తి, మరణాలు నమోదవుతున్నాయి. ఇటలీలో అయితే మొత్తం కరోనా మృతుల్లో 71 శాతం మంది పురుషులున్నారు. స్పెయిన్‌లో కూడా మొత్తం కరోనా బాధితుల్లో పురుషులతో పోల్చుకుంటే మహిళల సంఖ్య సగం కంటే తక్కువగా ఉంది. 


ఈ వ్యత్యాసానికి కారణం ఏమిటనేది శాస్త్రవేత్తలు ఎవరూ కచ్చితంగా నిర్ధారించలేకపోతున్నారు. పురుషుల్లో పొగతాగే అలవాటు ఎక్కువగా ఉండటం వారిలో అధిక మరణాలరేటుకు కారణమై ఉండొచ్చని విశ్లేషిస్తున్నారు. ఉదాహరణకు చైనాలో పురుషుల్లో 50 శాతం పొగతాగేవారుంటే, మహిళల్లో 2 శాతం మాత్రమే ఈ అలవాటు ఉంది. దీనివల్ల హృద్రోగ సంబంధ సమస్యలు సహజంగానే మహిళల్లో తక్కువగా ఉండే అవకాశం ఉంది. అంతేగాక పొగతాగేవారు తరచుగా పెదాలను తాకుతుంటారు. దీనివల్ల కరోనా వ్యాప్తించే అవకాశాలు ఎక్కువ. ఇది కూడా మహిళల్లో కరోనా వ్యాప్తి తక్కువగా ఉండటానికి దోహదం చేస్తోందని భావిస్తున్నారు. దీంతోపాటు పరిశుభ్రత, వైద్యుల సూచనలు, ఇతరత్రా జాగ్రత్తలు పాటించడంలో కూడా పురుషుల కంటే మహిళలు ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం కూడా కారణమై ఉండొచ్చని నిపుణుల అభిప్రాయం. 

Updated Date - 2020-03-28T05:50:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising