ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ మాస్క్‌ మేలు!

ABN, First Publish Date - 2020-03-05T05:44:41+05:30

కరోనా వైరస్‌ సోకకుండా ఉండాలంటే ముఖానికి మాస్క్‌ ధరించాలనే విషయం అందరికీ తెలిసిందే! అయితే మాస్క్‌ ఎంపిక మొదలు, ధరించి, తీసే విధానాల పట్ల కూడా అవగాహన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా వైరస్‌ సోకకుండా ఉండాలంటే ముఖానికి మాస్క్‌ ధరించాలనే విషయం అందరికీ తెలిసిందే! అయితే మాస్క్‌ ఎంపిక మొదలు, ధరించి, తీసే విధానాల పట్ల కూడా అవగాహన అవసరం.


ఈ మాస్క్‌ మేలు!

ఎన్‌ 95, ఎన్‌ 99 మాస్క్‌లు రెండూ సురక్షితమైనవే! ఈ రెండింటిలోనూ పీల్చే గాలిని వడగట్టే ఫిల్టర్లు ఉంటాయి. అయితే ఎన్‌ 95 పీల్చుకునే గాలిని 95ు శుద్ధి చేస్తే, ఎన్‌ 99, గాలిని 99ు శుద్ధి చేస్తుంది. కాబట్టి ఎన్‌ 99 మాస్క్‌తో వైరస్‌ సోకే అవకాశం తక్కువ. 


వాడే పద్ధతి..


ఆల్కహాల్‌తో తయారైన హ్యాండ్‌ వాష్‌ లేదా సబ్బుతో చేతులు తరచుగా కడుక్కుంటూ, మాస్క్‌లు కూడా వాడుతూ ఉంటేనే కరోనా వైరస్‌ నుంచి పూర్తి రక్షణ దక్కుతుంది. కాబట్టి మాస్క్‌ ధరించి, తీసిన ప్రతిసారీ చేతులు శుభ్రం చేసుకోవాలి.


మాస్క్‌ ధరించినప్పుడు ముక్కు, నోరు పూర్తిగా కవర్‌ అయ్యేలా చూసుకోవాలి.


మాస్క్‌ తడిస్తే వెంటనే మార్చాలి.


సింగిల్‌ యూజ్‌ మాస్క్‌లను తిరిగి వాడకూడదు.


మాస్క్‌ను ముందు నుంచి కాకుండా, వెనక వైపు నుంచి తొలగించాలి.


మాస్క్‌ ముందరి భాగాన్ని చేతులతో తాకకూడదు. పొరపాటున తాకితే వెంటనే చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.


తొలగించిన మాస్క్‌ను మూత ఉన్న చెత్త డబ్బాలో వేసి, సబ్బుతో చేతులు కడుక్కోవాలి.

Updated Date - 2020-03-05T05:44:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising