ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా మామ

ABN, First Publish Date - 2020-06-24T05:47:07+05:30

మహమ్మారి కరోనా దెబ్బకు మనిషి మరో మనిషిని ముట్టుకోవాలంటేనే వణికిపోతున్నాడు. ఒక పక్క వ్యక్తిగత పరిశుభ్రత... మరోవైపు భౌతిక దూరం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ట్రెండింగ్‌  

మహమ్మారి కరోనా దెబ్బకు మనిషి మరో మనిషిని ముట్టుకోవాలంటేనే వణికిపోతున్నాడు. ఒక పక్క వ్యక్తిగత పరిశుభ్రత... మరోవైపు భౌతిక దూరం. ఈ రెండింటినీ పాటించడం కోసం ఎన్నింటినో త్యాగం చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటికి అనుకోని అతిథి వస్తే? ఈ ఇతివృత్తంతో రూపొందించిన సెటైరికల్‌ లఘు చిత్రమే ‘కరోనా మామ’. 


భర్త టీవీలో కరోనా కేసులు, మరణాల వార్తలు చూస్తూ భయపడిపోతుంటాడు. ఎందుకలా షేకవుతున్నాడో అతని భార్యకు అర్థంకాదు. ఇంతలో ఇంటికి వాళ్ల మామ వస్తాడు. అదీ కరోనా విలయతాండవం చేస్తున్న ముంబయ్‌ నగరం నుంచి! అతడు శుచీ శుభ్రతా  అనేవి అసలు పట్టించుకోడు. వచ్చిన అతిథిని తొందరగా పంపించేయాలని భార్యాభర్తలు ప్లాన్‌ చేస్తుంటారు. కరోనా నియమాలు... అదేనండి... భౌతిక దూరం, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటిస్తూనే మామకు వాటి ఆవశ్యకత చెప్పేందుకు ప్రయత్నిస్తుంటారు. చివర్లో ఓ చిన్నపాటి ట్విస్ట్‌ ఆకట్టుకుంటుంది. సాయితేజ, రవితేజ, శైలజల అభినయం సందర్భానికి తగ్గట్టుగా ఉంటుంది. సన్నీ సాగర్‌ రచనకు రవితేజ, సాయితేజ దర్శకత్వం వహించారు. ఈ షార్ట్‌ ఫిల్మ్‌ను యూట్యూబ్‌లో పోస్ట్‌ చేసిన రెండు రోజుల్లోనే దాదాపు లక్షన్నర మంది వీక్షించారు. 

Updated Date - 2020-06-24T05:47:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising