ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంత చెప్పినా ఇంటివద్ద 27 శాతమే

ABN, First Publish Date - 2020-03-25T06:24:41+05:30

కరోనా మహమ్మారి కబళిస్తోందని నెత్తి నోరు కొట్టుకొని చెబుతున్నా ఇండియాలో ఎవరూ వినటం లేదు. కేవలం 27 శాతం మంది మాత్రమే ఇంటికి పరిమితమవుతున్నారని ఒక సర్వే వెల్లడించింది. ఐఎఎన్‌ ఎస్‌...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా మహమ్మారి కబళిస్తోందని నెత్తి నోరు కొట్టుకొని చెబుతున్నా ఇండియాలో ఎవరూ వినటం లేదు. కేవలం 27 శాతం మంది మాత్రమే ఇంటికి పరిమితమవుతున్నారని ఒక సర్వే వెల్లడించింది. ఐఎఎన్‌ ఎస్‌ - సి ఓటర్‌ గాలప్‌ ఇంటర్నేషనల్‌ అసోసియేషన్‌ నిర్వహించిన కరోనా ట్రాకర్‌ 1 సర్వే విస్తుగొలిపే వివరాలను వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఇరవై రెండు వేలమందికి మించి వ్యక్తులతో మాట్లాడింది. ఈ ప్రక్రియలో భాగంగా కొందర్ని నేరుగా కలిసింది. మరికొందర్ని ఆన్‌లైన్‌, టెలిఫోన్‌ ద్వారా సంప్రదించింది. మనదేశంలో మాత్రం 27 శాతం మంది మాత్రమే ఇంటిపట్టున ఉంటున్నారని తేల్చింది. మిగిలిన 73 శాతం మంది ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు పాటించటం లేదంది.  ప్రపంచవ్యాప్తంగా 45 శాతం మంది ప్రజలు ఇళ్ళ వద్దనే ఉంటున్నారని తెలిపింది. కరోనా వైరస్‌తో ఆరువేలమందికి పైగా ప్రజల్ని పోగొట్టుకున్న ఇటలీలో అత్యధికంగా 93 శాతం మంది ఇంటి వద్ద ఉండటమే కాదు, సామాజిక దూరాన్ని కూడా పాటిస్తున్నారని వెల్లడించింది. 90 శాతం మందితో ఆస్ర్టియాలో రెండో స్థానంలో ఉంది.  టర్కీలో అత్యంత తక్కువ అంటే 11 శాతం మంది మాత్రమే సామాజిక దూరం పాటిస్తున్నారని పేర్కొంది

Updated Date - 2020-03-25T06:24:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising