ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆంక్షల నేలపై కళను కొనసాగిస్తోంది!

ABN, First Publish Date - 2020-12-17T06:58:08+05:30

సోరయా షాహిదీ... ప్రపంచవ్యాప్తంగా పేరున్న టాటూ ఆర్టిస్ట్‌. ఆఫ్ఘస్థాన్‌లో టాటూ కళాకారిణి అయిన తొలి మహిళ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సోరయా షాహిదీ... ప్రపంచవ్యాప్తంగా పేరున్న టాటూ ఆర్టిస్ట్‌. ఆఫ్ఘస్థాన్‌లో టాటూ కళాకారిణి అయిన తొలి మహిళ కూడా ఆమే.  కానీ మహిళల స్వేచ్ఛపై ఆంక్షలున్న దేశంలో, తాలిబన్ల హెచ్చరికలను సైతం లెక్కచేయకుండా టాటూ ఆర్టిస్ట్‌గా ఎదిగేందుకు ఆమె చాలా కష్టపడ్డారు. ఇన్నాళ్లు విదేశాల్లో తన టాటూ కళతో గుర్తింపు పొందిన సోరమా ఇప్పుడు సొంత దేశంలోనూ టాటూ కళకు గుర్తింపు తీసుకురావాలనుకుంటున్నారు.


అయితే టాటూ తమ మత ఆచారాల ప్రకారం నిషేధం అంటూ కొందరు మతపెద్దలు ఆమె ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తున్నారు. మహిళలు స్వేచ్ఛగా, సాధికారికంగా బతకాలని విశ్వసించే సోరయా ధైర్యంగా తనకు నచ్చిన పని చేసుకుపోతున్నారు. కాబూల్‌లో ఆమె నడుపుతున్న మొబైల్‌ టాటూ పార్లర్‌కు యువత నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. 


‘‘చాలామంది మణికట్టు మీద, మెడ, కాళ్ల మీద టాటూ వేయించుకుంటున్నారు. అమ్మాయిలైతే సులభంగా ఉండే పువ్వులు, సీతాకోకచిలుక, తమకు ఇష్టమైన వారి పేర్లను టాటూలుగా వేయించుకుంటారు. ‘‘తాలిబాన్లు నా పనికి అడ్డు చెబితే, మహిళల స్వేచ్ఛ, సాధికారతను అడ్డుకోవాలని చూస్తే, వారికి వ్యతిరేకంగా నిలబడేవారిలో నేను మొదటివ్యక్తిని అవుతాను’’ అంటుంది సోరయా. ఆమె పని గిట్టని వారు పార్లర్‌పై ఆకస్మికదాడులు చేసే అవకాశం ఉండడంతో ఆమె ఎక్కువగా సోషల్‌ మీడియా, ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా టాటూ వేసుకోవాలనుకునే వారిని కలుస్తారు. 




టాటూ ఆర్టిస్ట్‌ ఎలా అయ్యిందంటే

కాబూల్‌లోని యూనివర్సిటీలో బిజినెస్‌ మేనేజిమెంట్‌ కోర్సు చదివిన సోరయా ఒకసారి టర్కీ వెళ్లినప్పుడు సరదాగా తన కుడిచేతి మీద బాణం గుర్తు టాటూ వేయించుకుంది. ఆ టాటూ చూసి వాళ్ల నాన్న, అన్నలు ఆమెను ‘టాటూ నేర్చుకొనే బతుకు పో’ అని కోప్పడ్డారు. మొదట్లో అయిష్టంగానే ఆమె టాటూ నేర్చుకున్నారు.


కానీ పెళ్లయి, భర్తతో విడిపోయాక తన ఎనిమిదేళ్ల కుమారిడిని పోషించేందుకు ఒక పని అవసరమైంది. దాంతో పూర్తిగా టాటూ మీద దృష్టి పెట్టారు సోరయా. ‘‘అఫ్ఘనిస్థాన్‌లో ఒక మహిళగా బతికేందకు ఎంతో ధైర్యం కావాలి. నాకు ఆ ధైర్యం ఉన్నందుకు నేను ఎంతో గర్వపడతాను’’ అంటున్న సోరయా అఫ్ఘన్‌ మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఫ


Updated Date - 2020-12-17T06:58:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising