ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కామిక్‌ కథలు చదివించాలంటే...

ABN, First Publish Date - 2020-11-25T05:46:01+05:30

ఇంట్లో పిల్లల అల్లరిని అదుపు చేసేందుకు వారికి టీవీ రిమోట్‌, మొబైల్‌ అందిస్తుంటారు చాలామంది తల్లితండ్రులు. అలాకాకుండా వారితో ఆన్‌లైన్‌లో కామిక్‌, కథల పుస్తకాలు చదివించే ప్రయత్నం చేయాలి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంట్లో పిల్లల అల్లరిని అదుపు చేసేందుకు వారికి టీవీ రిమోట్‌, మొబైల్‌ అందిస్తుంటారు చాలామంది తల్లితండ్రులు. అలాకాకుండా వారితో ఆన్‌లైన్‌లో కామిక్‌, కథల పుస్తకాలు చదివించే ప్రయత్నం చేయాలి. అలాచేస్తే వారిలో సృజనాత్మకత, విషయపరిజ్ఞానం పెరిగేందుకు దారి వేసిన వాళ్లమవుతాం. 


4 ఏళ్లు దాటిన పిల్లలకు

స్కూలు లేదు కాబట్టి పిల్లలు ఉదయం ఆలస్యంగా నిద్రలేచినా పర్లేదు. అందుకే వారికి రాత్రిపూట కథలు చెబుతూ నిద్రపుచ్చాలి. కామిక్‌ కథలు, పిల్లల పుస్తకాలు చదివించాలి. ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో ఐర్లాండ్‌ ఆర్టిస్ట్‌ ఓలివిర్‌ జెఫర్స్‌ హాస్య కథలు, బొమ్మలతో కూడిన పుస్తకాలు చూపించవచ్చు. ఆయన రాసిన ‘క్యాచ్‌ ఏ స్టార్‌’, ‘ద డే ద క్రేయాన్స్‌ క్విట్‌’ వంటి కథలను ఆయన వెబ్‌సైట్ oliverjeffers.comలో అందుబాటులో ఉన్నాయి. 

ఇంటర్నేషనల్‌ చిల్డ్రన్స్‌ డిజిటల్‌ లైబ్రరీ పిల్లలకు అర్థమయ్యే భాషలో చాలా విషయాలను తెలియజేస్తుంది. ఇందులో  పేర్లు నమోదు చేసుకుంటే వివిధ దేశాల, సంస్కృతులు తెలుసుకునేందుకు ఉపయోగపడే పుస్తకాలు ఎంచక్కా చదువుకోవచ్చు. en.childrenslibrary.org  వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయితే పిల్లలు చదువుకు సంబంధించిన చాలా విషయాలు తెలుసుకుంటారు.


7 ఏళ్లు దాటిన పిల్లలకు

ఈ వయసు పిల్లలను అలరించే కథలు, కామిక్‌ పుస్తకాలను అమర్‌చిత్ర కథ, ట్వింకిల్‌ వంటివి తమ ఆన్‌లైన్‌ సైట్లలో అందుబాటులో ఉంచాయి. అంతేకాదు వీటిని కొంతకాలం వరకు ఉచితంగా చదువుకునే వీలు కల్పించాయి. ACKfree, TinkleFree సైట్లలోకి వెళ్లి నచ్చిన పుస్తకం ఎంచుకోవచ్చు. 

అమెరికన్‌ చిత్రకారిణి కార్సోన్‌ ఎల్లిస్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యేకంగా ‘క్వారంటైన్‌ క్లబ్‌’ను ఈ మధ్యే ప్రారంభించింది. ఇందులో  పిల్లలతో పాటు ఆసక్తి గల పెద్దలు కూడా బొమ్మలు గీయడం, వాటికి చక్కగా రంగులు వేయడం వంటివి చేస్తూ సరదాగా గడపవచ్చు. 

లిట్‌ప్రో లైబ్రరీ వెబ్‌సైట్‌లో పిల్లలు పుస్తకం చదవడం అదీ వేగంగా తప్పులు దొర్లకుండా చదవడం ప్రాక్టీస్‌ చేసుకోవచ్చు. అంతేకాదు తాము చదివిన తీరు తెలుసుకునేందుకు ఆడియో రికార్డర్‌ సౌకర్యం కూడా ఉంది. కిండర్‌గార్టెన్‌ వయసు పిల్లలకు తేలిగ్గా అర్థమయ్యే పుస్తకాలు ఉంటాయి. పెద్దవాళ్లు SchlLitPro.com లోకి లాగిన్‌ అయ్యి పిల్లలచే రకరకాల పుస్తకాలు చదివించవచ్చు.

Updated Date - 2020-11-25T05:46:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising