ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాస్క్‌ ఇలా!

ABN, First Publish Date - 2020-06-18T05:30:00+05:30

కరోనా నుంచి మనల్ని మనం రక్షించుకోవడంలో మాస్క్‌లు ప్రధానం. అయితే ఏదో ఒకటిలే అని వాడేస్తే కుదరదు. పాటించే దూరం, ఆరోగ్య స్థితులను బట్టి మాస్క్‌ను ఎంచుకోవాలి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా నుంచి మనల్ని మనం రక్షించుకోవడంలో మాస్క్‌లు ప్రధానం. అయితే ఏదో ఒకటిలే అని వాడేస్తే కుదరదు. పాటించే దూరం, ఆరోగ్య స్థితులను బట్టి మాస్క్‌ను ఎంచుకోవాలి. అప్పుడే కరోనా నుంచి మెరుగైన రక్షణ పొందవచ్చు. సామాజిక దూరానికి అనుగుణంగా, ఆరోగ్య సమస్యలకు తగ్గట్టుగా ధరించవలసిన మాస్క్‌ల గురించి తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన మార్గదర్శకాలు ఇవే! 


బహిరంగ ప్రదేశాల్లో: 

సామాజిక దూరం పాటించవలసిన బహిరంగ ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఇంట్లో తయారు చేసుకున్న లేదా వస్త్రంతో తయారైన మాస్క్‌ను ధరించాలి. అయితే ఈ మాస్క్‌ కనీసం నాలుగు నుంచి ఐదు పొరలతో తయారై ఉండాలి. గాలిని వడగట్టేలా ఉండడంతో పాటు, కాటన్‌తో తయారై ఉండాలి. క్యాబ్‌, ఆటోల్లో ప్రయాణించే వారు, ఆఫీసులకు వెళ్లేవాళ్లు ఇలాంటి మాస్క్‌లు ధరించాలి. 


కిక్కిరిసిన ప్రదేశాల్లో:

కనీసం రెండు మీటర్ల దూరం కూడా పాటించలేని ప్రదేశాల్లో మెడికల్‌ మాస్క్‌ ధరించాలి. ఆస్పత్రులు, కరోనా బాధితుల సహాయకులు, కరోనా లక్షణాలు కలిగిన వారు, కరోనా విస్తృతంగా ప్రబలిన ప్రాంతాల్లో సంచరించే వాళ్లు, కనీసం ఒక మీటరు సామాజిక దూరం కూడా పాటించే వీలు లేని ప్రదేశాల్లో ఇలాంటి మాస్క్‌లను ధరించడం మేలు. అలాగే తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులు కూడా మెడికల్‌ మాస్కులు ధరించాలి.


Updated Date - 2020-06-18T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising