ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చాహల్‌ సహచరి.. యూట్యూబ్‌ స్టార్‌!

ABN, First Publish Date - 2020-08-12T05:30:00+05:30

టీమిండియా ఆటగాడు చాహల్‌ ఇటీవలే తన కాబోయే శ్రీమతిని సోషల్‌మీడియా వేదికగా అందరికీ పరిచయం చేశాడు. ముంబయికి చెందిన ధనశ్రీ వర్మతో రోకా వేడుక (నిశ్చితార్థం)అనంతరం దిగిన ఫొటో షేర్‌ చేస్తూ ‘తనే నా జీవిత సహచరి’...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీమిండియా ఆటగాడు చాహల్‌ ఇటీవలే తన కాబోయే శ్రీమతిని సోషల్‌మీడియా వేదికగా అందరికీ పరిచయం చేశాడు. ముంబయికి చెందిన ధనశ్రీ వర్మతో రోకా వేడుక (నిశ్చితార్థం)అనంతరం దిగిన ఫొటో షేర్‌ చేస్తూ ‘తనే నా జీవిత సహచరి’ అని చెప్పేశాడు. బంతితోనే కాదు, ‘చాహల్‌ టీవీ’ ద్వారా సరదా వీడియోలతో అలరించే ఈ స్పిన్నర్‌ మనసు దోచిన ఈ అమ్మాయి ఎవరనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. ఇంతకీ ఎవరీ ధనశ్రీ?


ధనశ్రీ పుట్టిపెరిగిందంతా ముంబయిలోనే. నవీముంబయిలోని డీవై పాటిల్‌ డెంటల్‌ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారు. చాలామందికి తెలియని విషయమేమంటే ఆమె ఒక పాపులర్‌ యూట్యూబ్‌ స్టార్‌. డాక్టర్‌గా కన్నా ఆమె యూట్యూబ్‌ స్టార్‌గానే అందరికీ బాగా పరిచయం. ధనశ్రీకి డాన్స్‌ అన్నా, కొరియోగ్రఫీ అన్నా చెప్పలేనంత ఇష్టం. బాలీవుడ్‌, హిప్‌-హాప్‌ పాటలకు అదరగొట్టే స్టెప్పులతో ధనశ్రీ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అందంతో పాటు తన క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆమె కొద్దిరోజుల్లోనే యూట్యూబ్‌లో సెలబ్రిటీ అయ్యారు. ఆమె డాన్స్‌ వీడియోలకు కోట్లలో అభిమానులున్నారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను అనుసరిస్తున్న వారి సంఖ్య అయిదు లక్షలపైనే. కొరియోగ్రఫీ మీద ఇష్టంతో సొంతంగా తన పేరుతో ‘ధనశ్రీ వర్మ కంపెనీ’ ప్రారంభించారు. ఫిట్‌నెస్‌, బాలీవుడ్‌ సాంగ్స్‌, హిప్‌-హాప్‌, వెడ్డింగ్‌ కొరియోగ్రఫీలో శిక్షణతో పాటు వర్క్‌షాప్స్‌ నిర్వహిస్తున్నారు. 




సోషల్‌మీడియాలో పాపులర్‌.. 

బాలీవుడ్‌ హీరోలు రాజ్‌కుమార్‌ రావు, కార్తీక్‌ ఆర్యన్‌, సారా అలీ ఖాన్‌, మౌనీ రాయ్‌, సింగర్‌ గురు రాంధ్వాతో కలిసి ధనశ్రీ చేసిన డ్యాన్స్‌ వీడియోలు ఎంతో పాపులర్‌ అయ్యాయి. ధనశ్రీ ‘ఓ సాకీ సాకీ’ పాటను సుమారు 11 మిలియన్ల మంది వీక్షించారు. ఈ మధ్యే ఆమె సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ చివరి సినిమా ‘దిల్‌ బేచారా’ సినిమాలోని ఒక పాటకు స్టెప్పులేశారు కూడా. ఆమె యూట్యూబ్‌ ఛానల్‌కు 15 లక్షల మంది సబ్‌స్క్రయిబర్స్‌ ఉన్నారు. అంతేకాదు ధనశ్రీ ఈ ఏడాది ‘టాలెంట్‌ రాక్‌ రైజింగ్‌ స్టార్‌’ అవార్డు (మహిళా విభాగంలో) అందుకున్నారు కూడా. ఎప్పుడూ డ్యాన్స్‌ ప్రపంచంలోనే మునిగి ఉండే ధనశ్రీకి తన పెంపుడు కుక్క అన్నా, కొత్త ప్రాంతాల్లో పర్యటించడమన్నా చాలా ఇష్టం. సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ధనశ్రీకి, టీమిండియా ఆటగాడు యజువేంద్ర చాహల్‌కు చాన్నాళ్ల నుంచి పరిచయం ఉంది. ఈ మధ్యే ఇరుకుటుంబాల పెద్దలు వీరి ప్రేమకు అంగీకారం తెలిపారు. ఐదు రోజుల క్రితం వీరి రోకా (నిశ్చితార్థం)వేడుక ఘనంగా జరిగింది.


Updated Date - 2020-08-12T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising