ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంట్లోనే మొక్కుదాం!

ABN, First Publish Date - 2020-06-26T05:30:00+05:30

తెలంగాణ ప్రాంతంలో ఆషాఢ మాసంలో గ్రామదేవతలను కొలిచి, వారికి మొక్కుబడులు సమర్పించే విశిష్టమైన సంబరం బోనాల పండుగ. ఏటా ఆషాఢ మాసంలో తొలి గురువారం లేదా ఆదివారం రోజున బోనాల ఉత్సవాలు మొదలవుతాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలంగాణ ప్రాంతంలో ఆషాఢ మాసంలో గ్రామదేవతలను కొలిచి, వారికి మొక్కుబడులు సమర్పించే విశిష్టమైన సంబరం బోనాల పండుగ. ఏటా ఆషాఢ మాసంలో తొలి గురువారం లేదా ఆదివారం రోజున బోనాల ఉత్సవాలు మొదలవుతాయి. ప్రస్తుతం కరోనా మహమ్మారి వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఇళ్ళలోనే మొక్కులను చెల్లించుకోవాలని అధికారులు సూచించారు. బయట ఘటాల ఊరేగింపులను నిషేధించారు. ఆలయాల్లో బోనాల నిర్వహణను పూజారులు మాత్రమే చేయనున్నారు. ఈ కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 


ప్రధానంగా ఎక్కడంటే...

  1. ఈ బోనాల ఉత్సవాలను గోల్కొండ కోటలోని శ్రీ ఎల్లమ్మ (జగదాంబిక) ఆలయంలో ప్రారంభించడం, ఆఖరి బోనం పూజను కూడా అక్కడే నిర్వహించడం సంప్రదాయం. తొలి బోనం పూజను ఈ నెల 25న నిర్వహించారు. జూలై 23న ఆఖరి పూజ ఉంటుంది. ఈ వేడుకల్లో గరిష్ఠంగా పదిమందిని మాత్రమే అనుమతించనున్నారు
  2. ఈ పాతబస్తీలోని లాల్‌ దర్వాజా సింహవాహిని మహాంకాళి అమ్మవారి ఆలయంలో కూడా ఈనెల 25 నుంచి వేడుకలు మొదలయ్యాయి. జూలై 19న బోనాలు జరుగుతాయి. సామూహికంగా కాకుండా ఎవరికివారు బోనాలు సమర్పించేలా ఏర్పాట్లు చేశారు. అలాగే నెల రోజుల పాటు ప్రతిరోజూ బోనాల సమర్పణకు వీలు కల్పిస్తున్నారు. 
  3. ఈ హరిబౌలి శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయంలో నేటి నుంచి (జూన్‌ 26) బోనాల ఉత్సవాలు మొదలవుతాయి. జూలై 19న అమ్మవారికి బోనాల సమర్పణ, 20న రంగం (భవిష్యవాణి) నిర్వహిస్తారు.
  4. ఈ సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాంకాళి ఆలయం వద్ద బోనాలు జూలై 12న, రంగం 13న జరుగుతాయి.

Updated Date - 2020-06-26T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising