ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కీరతో నిగారింపు!

ABN, First Publish Date - 2020-11-26T05:38:08+05:30

అలసిన కళ్లకు సాంత్వన చేకూరుస్తుంది కీర. అంతేకాదు కీరను పేస్టులా చేసి ముఖానికి పట్టిస్తే చర్మం నిగారింపు సంతరించుకుంటుంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అలసిన కళ్లకు సాంత్వన చేకూరుస్తుంది కీర. అంతేకాదు కీరను పేస్టులా చేసి ముఖానికి పట్టిస్తే చర్మం నిగారింపు సంతరించుకుంటుంది. 


ముందుగా గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. కీరను మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. దీనికి ఒక టేబుల్‌స్పూన్‌ ఓట్‌మీల్‌, ఒక టేబుల్‌స్పూన్‌ తేనె కలిపి మిశ్రమంలా చేసుకోవాలి. ఈ మిశ్రమంతో ముఖంపై నెమ్మదిగా మసాజ్‌ మాదిరిగా చేసుకోవాలి. 10 నుంచి 15 నిమిషాల పాటు అలా నెమ్మదిగా చేతి వేళ్లతో గుండ్రంగా మసాజ్‌ చేసుకోవాలి. తరువాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఆయిల్‌ స్కిన్‌ ఉన్న వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది.


కీరను మెత్తగా పేస్టు మాదిరిగా గ్రైండ్‌ చేసి ఒక టేబుల్‌స్పూన్‌ పెరుగును కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నెమ్మదిగా చేతి వేళ్లతో ముఖంపై మసాజ్‌ చేస్తున్నట్లుగా చేయాలి. పావుగంట తరువాత నీటితో కడిగేసుకోవాలి. పొడి చర్మం కలవారికి ఇది పనికొస్తుంది. 

Updated Date - 2020-11-26T05:38:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising