ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీట్‌రూట్‌ కబాబ్‌

ABN, First Publish Date - 2020-12-19T05:30:00+05:30

బీట్‌రూట్‌ తురుము - ఒకకప్పు, టోఫు - అర ప్యాకెట్‌, వెల్లుల్లి పేస్టు - అర టేబుల్‌స్పూన్‌, మామిడికాయ పొడి - ఒక టేబుల్‌స్పూన్‌, దానిమ్మగింజల పొడి - ఒక టేబుల్‌స్పూన్‌, ఛాట్‌మసాలా .....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చలి రోజురోజుకు  పెరుగుతున్న ఈ సమయంలో వేడి వేడి రుచులను ఆస్వాదించాలని ప్రతీ 

ఒక్కరికీ ఉంటుంది. చలిని పారదోలడంతో పాటు మీ జిహ్వ చాపల్యాన్ని తీర్చే అలాంటి 

రెసిపీలు ఇవి. మరి మీరూ ఈ వారం వీటిని టేస్ట్‌ చేయండి.


కావలసినవి:

బీట్‌రూట్‌ తురుము - ఒకకప్పు, టోఫు - అర ప్యాకెట్‌, వెల్లుల్లి పేస్టు - అర టేబుల్‌స్పూన్‌, మామిడికాయ పొడి - ఒక టేబుల్‌స్పూన్‌, దానిమ్మగింజల పొడి - ఒక టేబుల్‌స్పూన్‌, ఛాట్‌మసాలా - చిటికెడు, ఉప్పు - రుచికి తగినంత, జీడిపప్పు - పావు కప్పు, ఓట్స్‌ - అరకప్పు, నూనె - సరిపడా.


తయారీ విధానం

 ఒక పాత్రలో బీట్‌రూట్‌ తురుము తీసుకుని అందులో టోఫు, వెల్లుల్లి పేస్టు, మామిడికాయ పొడి, ఛాట్‌ మసాలా, దానిమ్మగింజల పొడి, తగినంత ఉప్పు వేసి కలపాలి.

 మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని పూరీలా కొద్దిగా వెడల్పులా చేసుకోవాలి. మధ్యలో జీడిపప్పు పలుకులు పెట్టి కబాబ్‌లుగా ఒత్తుకోవాలి.


 ఒక ప్లేట్‌లో ఓట్స్‌ తీసుకుని చేతులతో రబ్‌ చేయాలి.


 కబాబ్‌లకు ఓట్స్‌ అద్దుకుంటూ నూనెలో వేసి వేగించాలి.


 గ్రీన్‌ చట్నీతో తింటే బీట్‌రూట్‌ కబాబ్‌లు చాలా రుచిగా ఉంటాయి.


ముల్లంగి కోఫ్తా

కావలసినవి


తెల్ల ముల్లంగి - అరకేజీ, కొబ్బరి తురుము - ఒక టేబుల్‌స్పూన్‌, వేరుసెనగలు - అర టేబుల్‌స్పూన్‌, సెనగపిండి - రెండు టేబుల్‌స్పూన్లు, గరంమసాలా - ఒక టీస్పూన్‌, ఎండుమిర్చి - రెండు, పచ్చిమిర్చి - ఒకటి, ఉల్లిపాయ - ఒకటి, కొత్తిమీర - కొద్దిగా, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.


గ్రేవీ కోసం : ఎండుమిర్చి - నాలుగు, వెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్‌, ధనియాల పొడి - ఒక టీస్పూన్‌, పసుపు - అర టీస్పూన్‌, ఉల్లిపాయలు - రెండు, పెరుగు - 125 ఎంఎల్‌, నూనె - సరిపడా, గరంమసాలా - ఒక టీస్పూన్‌, యాలకులు - నాలుగు. 


తయారీ విధానం

 ముల్లంగిని చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి.


 తరువాత ముల్లంగిని మెత్తగా ఉడికించి, నీళ్లు తీసేసి మెత్తగా గ్రైండ్‌ చేసి పక్కన పెట్టుకోవాలి.


 కొబ్బరి తురుము, వేరుసెనగలు, సెనగపిండి, గరంమసాలా, ఎండుమిర్చి వేసి గ్రైండ్‌ చేయాలి.


 పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర వేసి కలపాలి. 


 తరువాత కొద్దిగా ఉప్పు వేసి, ముల్లంగితో కలియబెట్టాలి. 



 ఇప్పుడు చిన్న చిన్న బాల్స్‌లా చేసుకుంటూ నూనెలో వేగించుకుంటూ పక్కన పెట్టుకోవాలి.


 గ్రేవీ కోసం మిక్సీలో ఎండుమిర్చి, వెల్లుల్లి, ధనియాల పొడి, పసుపు, తగినంత ఉప్పు వేసి గ్రైండ్‌ చేసుకోవాలి.



 స్టవ్‌పై పాన్‌ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక ఆ మిశ్రమాన్ని వేసి వేగించాలి.


 ఉల్లిపాయలు వేయాలి. 


 తరువాత పెరుగు వేసి గరంమసాలా, యాలకులు, తరిగిన అల్లం వేయాలి. 


 కొద్దిగా నీళ్లు పోసి చిన్నమంటపై ఉడికించాలి.


 ఇప్పుడు వేగించి పెట్టుకున్న కోఫ్తాలు వేయాలి. కాసేపు ఉడికించి దింపాలి.

Updated Date - 2020-12-19T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising