ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చర్మసౌందర్యం కోసం ‘నయా’సినమైడ్‌!

ABN, First Publish Date - 2020-07-27T08:32:54+05:30

చర్మ సౌందర్యం, ఆరోగ్యం కోసం సి విటమిన్‌ తీసుకోవాలని వింటూ ఉంటాం. కానీ అంతకుమించి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చర్మ సౌందర్యం, ఆరోగ్యం కోసం సి విటమిన్‌ తీసుకోవాలని వింటూ ఉంటాం. కానీ అంతకుమించి ఉపయోగకరమైన మరో విటమిన్‌ గురించిన సమాచారం ఇప్పుడు సౌందర్య ప్రపంచంలో వెలుగులోకి వచ్చింది.  అదే ‘నియాసినమైడ్‌’. దీని అసలు రూపం విటమిన్‌ బి3! చర్మానికి ఇది చేసే మేలు ఏమిటంటే...


చర్మం అడుగున కొల్లాజెన్‌ కణజాలం ఉత్పత్తిని వృద్ధి చేయడం ద్వారా చర్మం తనంతట తాను మరమ్మతు చేసుకునే స్వభావాన్ని పెంచే గుణం ‘నియాసినమైడ్‌ (విటమిన్‌ బి3)’కు ఉంది. కాబట్టి చర్మ సౌందర్య చికిత్సలో ఈ విటమిన్‌ను జోడించడం ఎంతో అవసరం. అయితే అంతకన్నా ముందుగా నయాసినమైడ్‌ గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. 


నియాసినమైడ్‌ అంటే?

నీటిలో కరిగిపోయే తత్వం ఉన్న నియాసినమైడ్‌ చర్మ రంధ్రాలు కుంచించుకుపోయేలా చేసి, ముడతలు, సన్నని గీతలను తొలగిస్తుంది. అలాగే చర్మం నిర్జీవంగా మారకుండా నియంత్రిస్తుంది. పిగ్మెంటేషన్‌ను తొలగిస్తుంది. మన శరీరంలో జీవక్రియలు పెరగడానికి ఈ విటమిన్‌ ఎంతో అవసరం కూడా! అయితే నియాసినమైడ్‌ను మన శరీరం తనంతట తాను సరిపడా తయారు చేసుకోలేదు కాబట్టి బయట నుంచి ఈ విటమిన్‌ అందేలా చూసుకోవాలి. 


ఎందుకు అవసరం?

విటమిన్‌ బి3తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎనిమిది వారాలు క్రమం తప్పకుండా ఈ విటమిన్‌ తీసుకుంటే చర్మం బిగుతుగా మారుతుంది. ముడతలు మాయమవుతాయి. మొటిమలకు కారణమయ్యే చర్మపు జిడ్డును నియంత్రించే గుణం కూడా దీని సొంతం. అదే విధంగా  విటమిన్‌ బి3ని సోయా, గ్లిజరిన్‌, కోజిక్‌ యాసిడ్‌లతో కలిపి తీసుకుంటే రెట్టింపు ఫలితాలు పొందే వీలుంది. కాబట్టి నియాసినమైడ్‌ను క్రీమ్‌లు, సీరమ్‌, సన్‌స్ర్కీన్‌ రూపంలో వాడవచ్చు.


ఎవరికి అవసరం?

విటమిన్‌ బి3తో తయారైన సౌందర్య సాధనాలను ప్రతి ఒక్కరూ ఉపయోగించవచ్చు. అయితే సున్నితమైన చర్మం కలిగిన వారు కొంత అప్రమత్తంగా ఉండాలి. పొడిచర్మం కలిగిన వారు నియాసినమైడ్‌ రాసుకుంటే చర్మం తేమగా మారి, మాయిశ్చరైజర్లు, సీరమ్‌లు తేలికగా చర్మంలోకి ఇంకుతాయి. సౌందర్య ప్రపంచంలోకి సరికొత్తగా వచ్చిన ఈ పదం ప్రస్తుతం ఒక ట్రెండ్‌గా మారింది. 

Updated Date - 2020-07-27T08:32:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising