ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు సద్దుల బతుకమ్మ

ABN, First Publish Date - 2020-10-24T06:30:55+05:30

బతుకమ్మ వేడుకల్లో తొమ్మిదో రోజు, చివరి రోజు అయిన ఆశ్వయుజ శుద్ధ అష్టమి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బతుకమ్మ వేడుకల్లో తొమ్మిదో రోజు, చివరి రోజు అయిన ఆశ్వయుజ శుద్ధ అష్టమి (శనివారం) నాడు సద్దుల బతుకమ్మ లేదా పెద్ద బతుకమ్మను జరుపుతారు. పెద్ద పళ్ళెంలో గుమ్మడి ఆకులు, రంగులు అద్దిన గునుగుపూలు, తంగేడు, ఇతర రంగురంగుల పూలతో బతుకమ్మను పేరుస్తారు. సద్దులను నైవేద్యం పెట్టి, పూజలు చేస్తారు. అనంతరం రాత్రి వరకూ ఆటపాటలతో అమ్మవారిని కొలిచి, బతుకమ్మలను నిమజ్జనం చేస్తారు. 


నైవేద్యాలు: మలీద ముద్దలు (లడ్డూలు), చింతపండు పులిహోర, కొబ్బరి అన్నం. నువ్వుల అన్నం, పెరుగన్నం తదితరాలు.


బతుకమ్మ పాట

బైలెల్లు బతుకమ్మ

సాకి : గుంకంగ సూర్యుడు గూటిలో దీపమై సుక్కలు రాలె వాకిట్లో పువ్వులై

  • పల్లవి : బైలెల్లు బైలెల్లు బతుకమ్మ బైలెల్లు
  • కరోన నెదిరిస్తూ కవాతుగా వెళ్ళు
  • అదిగదిగో సీతాకోక సిలుకల్ల రంగులై
  • బంతీ చామంతి నారు మొలిసేటి మొలకలై
  • గునుగుల్ల తెలుపెరిగి గుమ్మాడి పసుపెరిగి

  • బంగారు వర్ణాల తంగేడు వనమెరిగి
  • బైలెల్లు బైలెల్లు బైలెల్లు బతుకమ్మ
  • మనుషులందరి మద్యా సోపతె పెంచమ్మ
  • ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాలో బతుకమ్మ
  • బహుజనుల మేలెరిగి రావాలి బతుకమ్మ

  • నిశి నిశి రాత్రులు నిరాశ చూపులు
  • దునియంత బంధీయైున దుఃఖసాగరములు
  • ముల్లే మూటల్తో నడిసె వలస కష్టాలు బోయి
  • పల్లె గూటికి చేరిన పక్షుల రాగాలై
  • బైలెల్లు బైలెల్లు బైలెల్లు బతుకమ్మ
  • ఉపాధి మార్గాలు అందించ రావమ్మా
  • ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాలో బతుకమ్మ
  • అమ్మోలె ఆదరువై మా వెంట ఉండమ్మా

  • ప్రకృతిని చెరబడితే మనిషే చెడిపోవునని
  • అడవుల్ని నరికేస్తే వానలే కరువాని
  • కొండలె పిండైతే వాగులె ఎండునని
  • పొలాలు లే అవుటై ఆకలి కేకలాని
  • బైలెల్లు బైలెల్లు బైలెల్లు బతుకమ్మా
  • కన్నీటి పాఠాలు కలెబోసుకోవాలమ్మ
  • ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాలో బతుకమ్మ
  • బహుజనుల బందువై సింధువై రావమ్మా

  • మక్కా బెల్లాలలతో మలీద ముద్దలు 
  • రామ సక్కానివమ్మ మన నవధాన్యాలు
  • పిజ్జాలు బర్గర్‌లు వదలేసి మత్తూలు
  • స్వదేశి సంపదకు సై అంటు నువ్వు కదులు
  • బైలెల్లు బైలెల్లు బైలెల్లు బతుకమ్మ
  • మన పంట మన ఇంటాని గొంతెత్తి పాడమ్మా

  • ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాలో బతుకమ్మ
  • వైరస్‌తో పోరాడే వీరత్వం పాడమ్మా 
  • మనిషీ యంత్రమైన పట్నాల్లో పాటుంది
  • పల్లే మారుతున్న పని పాట బతికుంది
  • సేను సెలుకలు వీచే స్వచ్ఛాని గాలుంది
  • పూలనే కొలిచేటి తెలంగాణ పండుగుంది
  • బైలెల్లు బైలెల్లు బైలెల్లు బతుకమ్మా
  • ఆకలి రోగాన్ని అధిగమించాలమ్మా
  • ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాలో బతుకమ్మా 
  • బహుజన బతుకమ్మా కవాతు జేయమ్మా


-మిత్ర


Updated Date - 2020-10-24T06:30:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising