ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిత్రమైన మహిమల గౌరమ్మ

ABN, First Publish Date - 2020-10-20T05:30:00+05:30

బతుకమ్మను సాక్షాత్తూ ఆదిశక్తి రూపమైన గౌరీదేవిగా కొలుస్తారు. బతుకమ్మ సంబురాల్లో గౌరీ దేవిని కొలుస్తూ పాడే పాటలు అనేకం. వాటిలో ఈ గీతం.....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బతుకమ్మను సాక్షాత్తూ ఆదిశక్తి రూపమైన గౌరీదేవిగా కొలుస్తారు. బతుకమ్మ సంబురాల్లో గౌరీ దేవిని కొలుస్తూ పాడే పాటలు అనేకం. వాటిలో ఈ గీతం సుప్రసిద్ధం.


శ్రీ లక్ష్మి నీ మహిమలు గౌరమ్మ

చిత్రమై తోచునమ్మ గౌరమ్మ


- భారతీ దేవివై బ్రహ్మకిల్లాలివై

పార్వతీ దేవివై పరమేశురాణివై

పరగ శ్రీలక్ష్మివై గౌరమ్మ

భార్యవైతివి హరికినీ గౌరమ్మ


- ఎన్నెన్నో రూపాలు

ఏడేడు లోకాలు

ఉన్న జనులకు

కోరికలు సమకూర్చగా

కన్న తల్లివైతివి గౌరమ్మ

కామధేనువు అయితివి గౌరమ్మ


- ముక్కోటి దేవతలు

సక్కని కాంతలు

ఎక్కువ పూలు గూర్చి

పెక్కు నోములు నోమి

ఎక్కువ వారైతిరీ గౌరమ్మ


- ఈ లోకముల నుండియు గౌరమ్మ

తమరి కంటే ఎక్కువ దైవము ఎవ్వరు లేరు

తమకింపు పట్టింపు సకల లోకంబుల

క్రమముచే పాలించగా గౌరమ్మ

కన్నుల పండుగాయే గౌరమ్మ

Updated Date - 2020-10-20T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising