ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒక్కరా.. ఇద్దరా!?

ABN, First Publish Date - 2020-12-13T06:55:06+05:30

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు తమిళనాడులోనే కాక దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు తమిళనాడులోనే కాక దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఆ మహానాయకురాలికి అపురూపమైన నివాళి అర్పిస్తూ, ఆమె జీవితకథ ఆధారంగా ‘తలైవి’ చిత్రం రూపుదిద్దుకుంటోంది. 


స్ఫూర్తిదాయకమైన జయలలిత కథను సెల్యులాయిడ్‌పై మలచడంలో  ‘తలైవి’ టీమ్‌ ఏ విషయంలోనూ రాజీ పడడం లేదు. ఇక  జయలలిత పాత్రలో ఒదిగిపోవడానికి కంగనా విశేషంగా కృషి చేస్తున్నారు. వివిధ దశల్లో కనిపించే జయలలిత శరీర ఆకృతికి మ్యాచ్‌ అయ్యే విధంగా తన బాడీని మలుచుకోవడానికి కంగనా ఎంతో శ్రమిస్తున్నారు. జయలలిత అలవాట్లు, ఆమె మాట్లాడే విధానం, హావభావాలు అన్నీ నిశితంగా పరిశీలించి, తెరపై అచ్చం జయలలితగా కనిపించడానికి కంగనా కేర్‌ తీసుకుంటున్నారు. జయలలిత ఒరిజనల్‌  ఫొటోను, ఆమె గెట్‌పలో ఉన్న కంగనా ఫొటోను పక్కపక్క పెట్టి చూస్తే ఒకరా.. ఇద్దరా! అనే అనుమానం కలగక మానదు. 

తమిళ, హిందీ, తెలుగు భాషల్లో ఏక కాలంలో విడుదల కానున్న ‘తలైవి’ చిత్రాన్ని విష్ణువర్ధన్‌ ఇందూరి, శైలేష్‌ ఆర్‌. సింగ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఏ ఎల్‌ విజయ్‌ దర్శకుడు.


Updated Date - 2020-12-13T06:55:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising