ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇవాళ్టి గూగుల్ డూడుల్ ప్రత్యేకత ఇది!

ABN, First Publish Date - 2020-09-29T17:22:58+05:30

ఇవాళ్టి గూగుల్ డూడుల్‌ను విఖ్యాత బాలీవుడ్ నటి, డ్యాన్సర్ జోహ్రా సెహగల్‌ను గుర్తు చేస్తూ రూపొందించారు. ఆమె నటించిన ‘నీచా నగర్’ సినిమా కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇవాళ్టి గూగుల్ డూడుల్‌ను విఖ్యాత బాలీవుడ్ నటి, డ్యాన్సర్ జోహ్రా సెహగల్‌ను గుర్తు చేస్తూ రూపొందించారు. ఆమె నటించిన ‘నీచా నగర్’ సినిమా కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించిన రోజు కావడంతో.. జోహ్రా స్మృత్యర్థం డూడుల్ రూపుదిద్దుకుంది. 1946లో సెప్టెంబర్ 29న సినిమాను ప్రదర్శించారు. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన తొలి భారతీయ నటిగా జోహ్రాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. 1912లో ఉత్తరప్రదేశ్‌లోని షహరన్‌పూర్ గ్రామంలో ఆమె జన్మించారు. పూర్తి పేరు షహిబ్జాది జోహ్రా బేగమ్ ముంజాత్ ఉల్లా ఖాన్. డ్యాన్సర్‌గా జీవితం ప్రారంభించినా.. తర్వాత బాలీవుడ్ రంగ ప్రవేశం చేసి ప్రేక్షకులను అలరించారు. ఆమె నటించిన నీచా నగర్ సినిమా కేన్స్ ఇంట్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికై.. ఉత్తమ చిత్రంగా అవార్డు సొంతం చేసుకుంది.  బాలీవుడ్ సినిమాల్లో నటించడమే కాకుండా బీబీసీ టెలివిజన్ షోలలోనూ ఆమె కనిపించారు. పద్మశ్రీ, పద్మవిభూషణ్ లాంటి ఎన్నో పురస్కారాలను ఆమె సొంతం చేసుకున్నారు. నిండు నూరేళ్లు జీవించిన జోహ్రా ... తన 102వ ఏట 2014లో తుదిశ్వాస విడిచారు. 

Updated Date - 2020-09-29T17:22:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising