ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నైట్‌క్లబ్‌లో యువత.. పెరుగుతున్న కరోనా: డబ్ల్యూహెచ్ఓ వ్యాఖ్య

ABN, First Publish Date - 2020-08-06T02:17:04+05:30

ప్రపంచ దేశాలు కరోనా ఆంక్షల సడలిస్తుండటంతో యువత నైట్‌క్లబ్లకూ, బీచ్‌లకూ క్యూ కడుతున్నారని, దీని కారణంగా కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జెనీవా: ప్రపంచ దేశాలు కరోనా ఆంక్షలు సడలిస్తుండటంతో యువత నైట్‌క్లబ్లకూ, బీచ్‌లకూ క్యూ కడుతున్నారని, దీని కారణంగా కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఐదు నెలల కాలంలోనే 15 నుంచి 24 ఏళ్ల వయసున్న కరోనా రోగుల సంఖ్య మూడింతలైందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ఫిబ్రవరి జులై మధ్య కాలంలో ఈ వయసుల వారిలో కరోనా కేసుల శాతం 4.5 నుంచి 18కి పెరిగిందని తెలిపింది.  ఇటీవల యువత ఎక్కువగా కరోనా బారినపడుతున్నారని అమెరికాతో పాటూ స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్, దేశాల ప్రభుత్వాలు ప్రకటించినట్టు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ‘భౌతిక దూరం, మాస్కు ధరించడం వంటి ముందు జాగ్రత్తల విషయంలో యువత అశ్రద్ధ కనబరుస్తున్నారు’ అని నిపుణులు చెబుతున్నారు. వృత్తి రీత్యా లేదా ఇతరత్రా కారణాలతో యువత అధికంగా ప్రయాణాలు చేస్తూ కరోనా బారిన పడుతున్నారని వారు హెచ్చరిస్తున్నారు.  

Updated Date - 2020-08-06T02:17:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising