ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒక్కరోజు సీఎంలాగా.. ట్రాఫిక్ ఆఫీసర్‌గా బాధ్యతలు తీసుకొని..

ABN, First Publish Date - 2020-02-20T02:07:16+05:30

కు ‘ఒకే ఒక్కడు’ సినిమాలోని ఒక్క రోజు సీఎం సీను గుర్తుందా? గుర్తుండే ఉంటది లేండి. ఈ సినిమాలో జరిగినట్లే.. నిజ జీవితంలోనూ జరిగింది. అదీ ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. అయితే మరీ ముఖ్యమంత్రి పదవి కాదులేండి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: మీకు ‘ఒకే ఒక్కడు’ సినిమాలోని ఒక్క రోజు సీఎం సీను గుర్తుందా? గుర్తుండే ఉంటది లేండి. ఈ సినిమాలో జరిగినట్లే.. నిజ జీవితంలోనూ జరిగింది. అదీ ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. అయితే మరీ ముఖ్యమంత్రి పదవి కాదులేండి. ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ ఇన్‌చార్జ్‌గా ఓ యువకుడిని 2 గంటలు నియమించారు. అసలేం జరిగిందంటే.. ఫిరోజాబాద్‌లోని తుండ్ల ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో సోను చౌహాన్ అనే యువకుడు ట్రాఫిక్‌ జామ్‌పై ఫిర్యాదు చేస్తూ ఎస్పీ సచింద్ర పటేల్‌కు లేఖ అందజేశాడు. అయితే ఆ ట్రాఫిక్‌ను నియంత్రించాలంటూ చౌహాన్‌కు ఎస్పీ సూచించారు.


ఆ మేరకు 2 గంటల పాటు ట్రాఫిక్ సర్కిల్ ఆఫీసర్‌గా చౌహాన్‌కు బాధ్యతలు అప్పగించారు. అతనికి సహాయంగా సర్కిల్ ఆఫీసర్ స్థాయి అధికారిని నియమించాడు. అయితే చౌహాన్ ఏమాత్రం సందేహించలేదు. ఎస్పీ ఇచ్చిన అవకాశాన్ని వెంటనే అందిపుచ్చుకుని.. తుండ్లా ఏరియాలోని సుభాష్ క్రాస్ రోడ్డులో ట్రాఫిక్ నియంత్రణ చేసే పని చేపట్టాడు. ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా అడ్డదిడ్డంగా వాహనాలు నడుపుతున్న చాలా మందికి చలాన్లు విధించాడు. రోడ్డుపై భిక్షాటన చేసేవారిని పంపించేశాడు.


ప్రత్యామ్నాయ దారులను తెలుపుతూ వాహనదారులకు సూచనలు చేశాడు. ఇలా తనకు ఇచ్చిన రెండు గంటల సమయాన్ని చక్కగా వినియోగించుకుని ట్రాఫిక్ నియంత్రణలో చౌహాన్ విజయం సాధించాడు. కాగా, తన అనుభవం గురించి స్పందించిన సోను చౌహాన్.. ట్రాఫిక్ నియమాలు ఒక్క రోజు పాటిస్తే సరిపోదని, ప్రతి రోజు ఆచరిస్తేనే ట్రాఫిక్ సమస్య ఉండదని పేర్కొన్నాడు.

Updated Date - 2020-02-20T02:07:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising