జ్ఞానభారతిలో వెయ్యి కోట్లతో యోగా వర్సిటీ
ABN, First Publish Date - 2020-09-14T08:18:13+05:30
ప్రధానమంత్రి నరేంద్రమోదీ కలల ప్రాజెక్టు బెంగళూరును వరించింది. బెంగళూరు విశ్వవిద్యాలయంలోని జ్ఞానభారతి ప్రాంగణంలో రూ.వెయ్యి కోట్లతో యోగా యూనివర్సిటీ ఏర్పాటు కానుంది.
బెంగళూరు, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్రమోదీ కలల ప్రాజెక్టు బెంగళూరును వరించింది. బెంగళూరు విశ్వవిద్యాలయంలోని జ్ఞానభారతి ప్రాంగణంలో రూ.వెయ్యి కోట్లతో యోగా యూనివర్సిటీ ఏర్పాటు కానుంది. ప్రధానమంత్రి కార్యాలయం సూచనల మేరకు యోగా యూనివర్సిటీ నిర్మాణాలకు యూజీసీ సిద్ధమైంది.
జ్ఞానభారతి క్యాంప్‌సలో 15 ఎకరాల విస్తీర్ణంలో విశ్వవిద్యాలయం ఏర్పాటు కానుందని బెంగళూరు విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ కేఆర్.వేణుగోపాల్ శనివారం ప్రకటించారు. యోగా యూనివర్సిటీ ఏర్పాటుకు వివిధ రాష్ట్రాలు ఆసక్తి చూపాయి. అందుకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తామని భరోసా ఇచ్చాయి.
బెంగళూరులోని జిగణిలో ఉన్న యోగా కేంద్రం కూడా 10 ఎకరాలు కేటాయించేందుకు ముందుకు వచ్చింది. కానీ పీఎంఓ మాత్రం బెంగళూరు యూనివర్సిటీ క్యాంప్‌సలోని జ్ఞానభారతిలో ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసింది. క్యాంప్‌సలోని 15 ఎకరాలను యూజీసీకి 30 ఏళ్లపాటు లీజుకు ఇవ్వనున్నట్టు వీసీ తెలిపారు. పర్యావరణం, జీవవైవిధ్య సంరక్షణ లక్ష్యంగా యూనివర్సిటీ ఏర్పాటు కానుందన్నారు.
Updated Date - 2020-09-14T08:18:13+05:30 IST