ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వూహాన్‌లో సాధారణ పరిస్థితులు..బస్సుల రాకపోకలు షురూ

ABN, First Publish Date - 2020-03-25T12:52:49+05:30

కరోనా వైరస్ ఉద్భవించిన చైనా దేశంలోని వూహాన్ నగరంలో రెండు నెలల లాక్‌డౌన్ అనంతరం బుధవారం సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 వూహాన్ (చైనా) : కరోనా వైరస్ ఉద్భవించిన చైనా దేశంలోని వూహాన్ నగరంలో రెండు నెలల లాక్‌డౌన్ అనంతరం బుధవారం సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి.బుధవారం ఉదయం తెల్లవారుజామున 5.25 గంటలకు వూహాన్ నగరంలో బస్సు సర్వీసులు రాకపోకలు సాగించాయి. హుబే ప్రావిన్సులోని హాంకౌ రైల్వేస్టేషను నుంచి 9 వారాల లాక్ డౌన్ తర్వాత మొట్టమొదటిసారి బుధవారం బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఒక్కో బస్సులో ఓ డ్రైవరుతోపాటు ప్రయాణికుల ఆరోగ్యం గురించి పరీక్షించేందుకు ఓ సేఫ్టీ సూపర్ వైజర్ ను నియమించారు.


స్మార్ట్ ఫోన్ వినియోగించని ప్రయాణికులు బస్సులో ప్రయాణం చేయాలంటే హెల్త్ సర్టిఫికెట్ తీసుకురావాలని వూచాంగ్ రైల్వేస్టేషను నుంచి నడిపే బస్సు సేఫ్టీ సూపర్ వైజర్ జో జింజింగ్ చెప్పారు. చైనాలో కరోనా బారిన పడి విలవిల్లాడిన వూహాన్ నగరంలో జనవరి 23 నుంచి బస్సులు, విమానాలు, రైళ్లల సర్వీసులను రద్దు చేశారు. ఒకవైపు కరోనా వైరస్ ప్రబలుతుండటంతో ప్రపంచంలో పలు దేశాలు లాక్ డౌన్ విధిస్తుండగా, మరో వైపు కరోనా వైరస్ కు కేంద్ర స్థానమైన వూహాన్ నగరంలో సాధారణ పరిస్థితులు నెలకొని బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి.

Updated Date - 2020-03-25T12:52:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising