ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోవిడ్-19తో ప్రపంచ ఆర్థిక పరిస్థితి దారుణం : ఐఎంఎఫ్

ABN, First Publish Date - 2020-04-10T00:44:52+05:30

గడచిన శతాబ్దంలో ఎదురైన సంక్షోభాలన్నిటిలో అత్యంత తీవ్ర ప్రభావం చూపుతున్నది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్ : గడచిన శతాబ్దంలో ఎదురైన సంక్షోభాలన్నిటిలో అత్యంత తీవ్ర ప్రభావం చూపుతున్నది కరోనా వైరస్ మహమ్మారి అని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టలినా జార్జీవా అన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గ్రేట్ డిప్రెషన్ తర్వాత భారీగా దెబ్బతినడానికి కారణం ఈ మహమ్మారేనన్నారు. 2020లో ప్రపంచ వృద్ధి వ్యతిరేకాత్మకం అవుతుందని హెచ్చరించారు. ఐఎంఎఫ్ సభ్య దేశాలు 180 కాగా, వీటిలో 170 దేశాల్లో తలసరి ఆదాయం క్షీణించిందని చెప్పారు. 


వచ్చే వారం ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు స్ప్రింగ్ మీటింగ్స్ జరుగుతాయి. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ఆంక్షలు అమలవుతుండటంతో ఈ సమావేశాలను డిజిటల్ విధానంలో నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టలినా జార్జీవా గురువారం ప్రసంగించారు. 


నిజానికి తాము గ్రేట్ డిప్రెషన్ తర్వాత అత్యంత దయనీయమైన ఆర్థిక వ్యవస్థ పతనం రాబోతోందని భావిస్తున్నట్లు క్రిస్టలినా తెలిపారు. వచ్చే ఏడాది పాక్షికంగా మాత్రమే కోలుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది చివరికి కరోనా వైరస్ తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని భావిస్తున్నట్లు తెలిపారు. పరిస్థితి మరింత దిగజారే అవకాశాలే కనిపిస్తున్నాయని, ఎటు చూసినా తీవ్రమైన అనిశ్చితి కనిపిస్తోందని చెప్పారు. 


వ్యాపారాలు, కుటుంబాలు కోలుకోవాలంటే ప్రభుత్వాలు మరింత అండగా నిలవాలని పిలుపునిచ్చారు. 


ఇప్పటికే వివిధ దేశాలు దాదాపు 8 ట్రిలియన్ డాలర్ల విలువైన ప్యాకేజీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. 


జనవరిలో ఐఎంఎఫ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం, ప్రపంచ వృద్ధి రేటు 2020లో 3.3 శాతం, 2021లో 3.4 శాతం అని అంచనా. అయితే ఆ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయిన సంగతి తెలిసిందే. 


అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు తారతమ్యాలు లేకుండా, ఒకే విధంగా దెబ్బతిన్నాయని జార్జీవా చెప్పారు. 


Updated Date - 2020-04-10T00:44:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising