ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్ పాక్ విషయంలో కల్పించుకోలేం: ప్రపంచ బ్యాంకు

ABN, First Publish Date - 2020-08-09T20:38:00+05:30

భారత్ పాక్ మధ్య నెలకొన్న ఇండస్ నదీ జలాల వివాద పరిష్కారం కోసం ఈ అంశాల్లో నిపుణుడైన వ్యక్తిని నియమించాలా లేక ఆర్బిట్రేషన్ కోర్టును ఏర్పాటు చేయాలా అనే విషయంలో తాము కల్పించుకోలేమని ప్రపంప బ్యాంకు స్పష్టం చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: భారత్, పాక్ మధ్య నెలకొన్న ఇండస్ నదీ జలాల వివాద పరిష్కారం కోసం ఈ అంశాల్లో నిపుణుడైన వ్యక్తిని నియమించడం లేక ఆర్బిట్రేషన్ కోర్టును ఏర్పాటు చేయడంపై తాము నిర్ణయం తీసుకోలేమని ప్రపంప బ్యాంకు స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఇరు దేశాలూ ద్వైపాక్షికంగా మాత్రమే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. దాదాపు తొమ్మిదేళ్ల పాటు జరిగిన చర్చల ఫలితంగా భారత్ పాక్‌ల మధ్య 1960లో సింధు నదీ జలాల వినియోగం కోసం ఓ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందంపై అప్పట్లో ప్రపంచ బ్యాంకు కూడా సంతకం చేసింది.  కానీ.. తదనంతర కాలంలో ఇరు దేశాల మధ్య ఒప్పందం అమలు విషయంలో ఎన్నో అభిప్రాయభేదాలు పొడచూపాయి.  వీటిని తొలగించేందుకు ప్రత్యేక కోర్టును (కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్) ఏర్పాటు చేయాల్సిందిగా పాక్ సూచిస్తే.. నిష్ఫాక్షికమైన నిపుణుడి ద్వారా సమస్యను పరిష్కారించాలని భారత్ ప్రతిపాదించింది. ఈ విషయమై తాజాగా స్పందించిన ప్రపంచ బ్యాంకు.. ఏ దారి ఎంచుకోవాలనేదాన్ని తాము నిర్ణయించజాలమని..భారత్‌,పాక్‌లే ఓ నిర్ణయానికి రావాలని స్పష్టం చేసింది. 

Updated Date - 2020-08-09T20:38:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising