మహిళా భద్రతకు అత్యంత ప్రాధాన్యం: కిషన్ రెడ్డి
ABN, First Publish Date - 2020-11-03T07:25:47+05:30
మహిళల భద్రతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మహిళలు సురక్షితంగా ఉండేందుకు చట్టాలు రూపొందించడానికి, మౌలిక సదుపాయాలు కల్పించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు...
న్యూఢిల్లీ, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): మహిళల భద్రతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మహిళలు సురక్షితంగా ఉండేందుకు చట్టాలు రూపొందించడానికి, మౌలిక సదుపాయాలు కల్పించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఢిల్లీలో ఆనందీ ఫౌండేషన్ అనే సంస్థ మహిళా భద్రత అంశంపై సోమవారం నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మహిళలను వేధింపులకు గురిచేసేవారికి కఠిన శిక్షలు విధించేందుకు ఎప్పటికప్పుడు క్రిమినల్ చట్టాలను సవరిస్తున్నట్లు చెప్పారు. 12 ఏళ్లలోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడితే ముందస్తు బెయిల్ లేకుండా, నిందితులకు మరణ శిక్ష, రెండు నెలల్లో దర్యాప్తు పూర్తి చేయడం వంటి కీలక మార్పులను తీసుకొచ్చినట్లు తెలిపారు. 8 పెద్ద నగరాల్లో సేఫ్ సిటీ ప్రాజెక్టులను ప్రారంభించామని, ఫోరెన్సిక్ సాక్ష్యాల సేకరణలో ప్రామాణికాలను బలోపేతం చేశామని తెలిపారు.
Updated Date - 2020-11-03T07:25:47+05:30 IST