బిహార్ ఎన్నికల్లోనూ వెనుకబడ్డ మహిళలు
ABN, First Publish Date - 2020-11-03T21:01:05+05:30
ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న బిహార్‌లో కూడా మహిళా అభ్యర్థుల సంఖ్య 10 శాతానికి మించి లేదు. ఈరోజు జరుగుతున్న రెండవ దశ పోలింగ్‌లో పదంటే పది శాతం మాత్రం మాత్రమే మహిళా అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 94 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతుండగా 1,463 అభ్యర్థులు బరిలో ఉన్నారు
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా అభ్యర్థుల చాలా తక్కువగా ఉంది. గత సార్వత్రిక ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లపై కొంత చర్చ జరిగినప్పటికీ దాన్ని ఎవరూ అంత సీరియస్‌గా తీసుకోలేదు. అయితే రిజర్వేషన్ డిమాండ్ కోటాను మించి తృణమూల్ కాంగ్రెస్ 40 శాతం మహిళలకు సీట్లిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక బీజేడీ సైతం మొత్తం స్థానాల్లో 37 శాతం మహిళలకు కేటాయించింది. ఈ రెండు పార్టీలు మినహా అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలు మహిళలకు అరకొర సీట్లే ఇచ్చాయి. తాము అధికారంలోకి వస్తే 33 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ తమ చేతుల్లోనే ఉన్న సీట్ల పంపకాల్లో మహిళలకు అన్యాయమే చేసింది. కేవలం 13.7 శాతం సీట్లు మాత్రమే మహిళలకు కేటాయించింది. వాస్తవ డిమాండ్‌లో ఇది సగం కంటే చాలా తక్కువ. ఇక అధికారంలో ఉన్న బీజేపీ అయితే కాంగ్రెస్ కంటే నాలుగు అడుగులు ముందుకు వేసి కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో మహిళకు సమ ప్రాధాన్యం ఇస్తామని వాగ్దానం చేసింది. ఆ పార్టీ కూడా మహిళలకు కేవలం 12 శాతం మాత్రమే సీట్లు కేటాయించింది. ఇది కాంగ్రెస్ కేటాయించిన సీట్ల కంటే కూడా తక్కువ. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో శివసేన, అన్నాడీఎంకే పార్టీలు మహిళలకు అతి తక్కువ సీట్లు కేటాయించాయి. ఈ రెండు పార్టీల నుంచి ఒకే ఒక్క మహిళ పోటీలోకి దిగారు. వీళ్లే కాకుండా బీఎస్పీ, జేడీయూ పార్టీలు కూడా మహిళకు మొండి చేయ్యే చూపించాయి. ఈరెండు పార్టీల నుంచి ఒక్కో మహిళా అభ్యర్థి మాత్రమే బరిలో నిలిచారు.
ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న బిహార్‌లో కూడా మహిళా అభ్యర్థుల సంఖ్య 10 శాతానికి మించి లేదు. ఈరోజు జరుగుతున్న రెండవ దశ పోలింగ్‌లో పదంటే పది శాతం మాత్రం మాత్రమే మహిళా అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 94 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతుండగా 1,463 అభ్యర్థులు బరిలో ఉన్నారు. అందులో 146 మాత్రమే మహిళా అభ్యర్థులు ఉన్నారు. ఇంతకు ముందు జరిగిన మొదటి దశ పోలింగ్‌లో 71 నియోజకవర్గాల్లో 1,066 అభ్యర్థులు బరిలోకి దిగారు. అందులో మహిళా అభ్యర్థుల సంఖ్య 114 మాత్రమే. దీనికి ముందు జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బిహార్ కంటే తక్కువ మంది మహిళా అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీ బరిలో 3,237 అభ్యర్థులు పోటీకి దిగగా, అందులో మహిళలు 235 మాత్రమే. మొత్తం అభ్యర్థుల సంఖ్యలో మహిళా వాటా 7.3 శాతమే. అయితే మహారాష్ట్రతో పాటు బిహార్‌లో సైతం స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కేటాయించడం విశేషం.
Updated Date - 2020-11-03T21:01:05+05:30 IST