ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భర్త అస్థికలను పెట్టెలో తీసుకెళ్తున్న మహిళ.. ఎయిర్‌పోర్టు పోలీసులు షాక్..

ABN, First Publish Date - 2020-08-04T23:00:23+05:30

జర్మనీలోని మ్యూనిక్ విమానాశ్రయంలో ఇవాళ ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. 74 ఏళ్ల వృద్ధురాలు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెర్లిన్: జర్మనీలోని మ్యూనిక్ విమానాశ్రయంలో ఇవాళ ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. 74 ఏళ్ల వృద్ధురాలు తీసుకెళ్తున్న ఓ పెట్టెను తనిఖీ చేసిన పోలీసులు అందులో మానవ అస్థికలు చూసి షాక్ అయ్యారు. ప్రాథమిక విచారణ అనంతరం అవి ఆమె భర్త అస్థికలేననీ... అధికారుల అనుమతి మేరకే తన స్వస్థలానికి వాటిని తరలిస్తోందని తెలిసి ఊపిరిపీల్చుకున్నారు. తొలుత పెట్టెను స్వాధీనం చేసుకున్న ఎయిర్‌పోర్టు పోలీసులు హుటాహుటిన కస్టమ్స్ అధికారులు, ఓ డాక్టర్, ప్రాసిక్యూటర్లను అక్కడికి రప్పించారు. అయితే ఈ వ్యవహారం వెనుక ఎలాంటి నేరం జరగలేదని వారు తేల్చినట్టు స్థానిక మీడియా వెల్లడించింది.


పోలీసుల విచారణలో సదరు వృద్ధురాలు,  54 ఏళ్ల ఆమె కుమార్తె వెల్లడించిన వివరాల ప్రకారం.. వీరిద్దరూ గ్రీస్ నుంచి మ్యూనిక్, కైవ్ మీదుగా అర్మేనియా వెళ్తున్నారు. తన భర్త 2008లో చనిపోగా గ్రీస్‌లోని థెస్సలోనికీలో ఖననం చేసినట్టు వృద్ధురాలు పేర్కొంది. ఇప్పుడు తన కుమార్తెతో కలిసి అర్మేనియాలో అంత్యక్రియలు నిర్వహించేందుకు భర్త అస్థికలను తీసుకెళ్తున్నట్టు వివరించింది. తల్లీకూతుళ్లను కొద్దిసేపు విచారించిన అనంతరం.. ఆ పెట్టెను తీసుకుని ప్రయాణించేందుకు పోలీసులు అనుమతించారు.

Updated Date - 2020-08-04T23:00:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising