ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రంప్‌కు విషపు పార్సిల్.. మహిళ అరెస్ట్..

ABN, First Publish Date - 2020-09-21T18:00:47+05:30

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు విష పదార్థంతో నింపిన పార్సిల్ పంపిన ఘటనలో అధికారులు ఓ అనుమానితురాలిని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు విష పదార్థంతో కూడిన పార్సిల్ పంపిన ఘటనలో అధికారులు ఓ అనుమానితురాలిని అదుపులోకి తీసుకున్నారు. అమెరికా-కెనడా సరిహద్దు వద్ద ఆమెను అరెస్ట్ చేసినట్టు ఎఫ్‌బీఐ అధికారి ఒకరు వెల్లడించారు. ‘‘అనుమానిత పార్సిల్ పంపినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ మహిళను అదుపులోకి తీసుకున్నాం. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది...’’ అని ఆయన తెలిపారు. అరెస్ట్ అయిన మహిళ కెనడా పౌరురాలిగా అధికార వర్గాలు చెబుతున్నాయి. కాగా కెనడా నుంచే సదరు లేఖ వెళ్లినట్టు గుర్తించడంతో.. ఈ కేసులో విచారణ కోసం ఎఫ్‌బీఐ అధికారులు తమ సాయం కోరినట్టు కెనడా పోలీసులు వెల్లడించారు.


నిన్న కొందరు గుర్తు తెలియని వ్యక్తులు డొనాల్డ్‌ ట్రంప్‌కు విష పదార్థంతో కూడిన ఓ పార్సిల్ పంపడంపై తీవ్ర కలకలం రేగిన విషయం తెలిసిందే. అయితే అది వైట్‌ హౌస్‌కు చేరకముందే ఫెడరల్‌ అధికారులు పసిగట్టడంతో పెను ముప్పుతప్పింది. ఆ కవర్‌ లోపల రిసిన్‌ అనే ప్రాణాంతక విష పదార్థం ఉన్నట్టు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించామని అధికారులు తెలిపారు.  

Updated Date - 2020-09-21T18:00:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising