ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జనవరి నాటికి కరోనాకు చెక్ పడుతుందా ?

ABN, First Publish Date - 2020-08-06T20:44:13+05:30

వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే కరోనా వైరస్ నియంత్రణ సాధ్యపడుతుందని ప్రజలు బలంగా విశ్వసిస్తున్న విషయం తెలిసిందే. కాగా... వచ్చే సంవత్సరం ప్రారంభం నాటికి ఔషధ తయారీ సంస్థల నుంచి వ్యాక్సిన్ సాధ్యమవుతుందని తాజాగా అమెరికా వైద్య నిపుణుడు ఆంటోనీ ఫౌచీ చెప్పారు. ‘రాయిటర్స్’ వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హ్యూస్టన్ : వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే కరోనా వైరస్ నియంత్రణ సాధ్యపడుతుందని ప్రజలు బలంగా విశ్వసిస్తున్న విషయం తెలిసిందే. కాగా... వచ్చే సంవత్సరం ప్రారంభం నాటికి ఔషధ తయారీ సంస్థల నుంచి వ్యాక్సిన్ సాధ్యమవుతుందని తాజాగా అమెరికా వైద్య నిపుణుడు ఆంటోనీ ఫౌచీ  చెప్పారు. ‘రాయిటర్స్’ వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు.


ఎక్కువ స్థాయి, సామర్థ్యం కలిగిన వ్యాక్సిన్, తగిన వైద్య సేవల లభ్యత వల్ల వైరస్ ను కట్టడి చేయడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోన్న నేపధ్యంలో... దానిని పూర్తిస్థాయిలో అదుపు చేయవచ్చని తాను భావించడం లేదని,వ్యాక్సిన్, తగిన వైద్య సేవలు లభ్యమైతే మాత్రం వైరస్ ను చాలావరకు అదుపు చేయడం సాధ్యమేనని చెప్పారు. కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ఈ స్థాయిలో వైరస్ వ్యాప్తి చెందదని, వైరస్ వ్యాప్తి జరిగినా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపదని పేర్కొన్నారు. 


మరోవైపు ప్రపంచవ్యాప్తంగా 1.89 లక్షల కరోనా కేసులు నమోదు కాగా 7,11,252 మంది మృతి చెందారు. భారత్ లో కరోనా కేసుల సంఖ్య 20 లక్షలకు చేరువలో ఉండగా, మృతుల సంఖ్య 40 వేలు దాటింది. ఇక... తెలుగు రాష్ట్రాల్లో ప్రతిరోజూ వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. 


Updated Date - 2020-08-06T20:44:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising