ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్ర సాయం లేకుండానే బడ్జెట్ ప్రవేశపెడతాం : పుదుచ్చేరి సీఎం

ABN, First Publish Date - 2020-06-05T03:27:33+05:30

కేంద్ర ప్రభుత్వం పుదుచ్చేరికి ఇవ్వవలసిన నిధులను విడుదల చేయడం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పుదుచ్చేరి : కేంద్ర ప్రభుత్వం పుదుచ్చేరికి ఇవ్వవలసిన నిధులను విడుదల చేయడం లేదని పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి నారాయణ స్వామి గురువారం ఆగ్రహం వ్యక్తం చేశారు. వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) పరిహారం,  7వ వేతన సవరణ సంఘం బకాయిల భర్తీ వంటివి తమకు అందడం లేదని వాపోయారు. అయినప్పటికీ వార్షిక బడ్జెట్‌ను త్వరలో ప్రవేశపెడతామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సాయం లేకుండానే బడ్జెట్‌ను ప్రవేశపెట్టవలసి వస్తోందన్నారు. 


పుదుచ్చేరి పరిస్థితిని ప్రధాన మంత్రి, ఆరోగ్య, ఆర్థిక మంత్రులకు వివరించామని, అయినప్పటికీ వారి నుంచి స్పందన రావడం లేదని తెలిపారు. 


రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు తమ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితిలో కూడా లేవన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం తమకు సహాయపడటానికి ముందకు రావాలని అన్నారు. 


Updated Date - 2020-06-05T03:27:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising