ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోవిడ్-19పై భారత్ ముందే మేల్కొంది... ప్రపంచ ఆరోగ్య సంస్థ కితాబు..

ABN, First Publish Date - 2020-04-03T22:47:08+05:30

ప్రాణాంతక మహమ్మారి కోవిడ్-19కు చెక్ పెట్టేందుకు నరేంద్ర మోదీ సారధ్యంలోని భారత ప్రభుత్వం తీసుకుంటున్న..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రాణాంతక మహమ్మారి కోవిడ్-19కు చెక్ పెట్టేందుకు నరేంద్ర మోదీ సారధ్యంలోని భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నుంచి మరోసారి ప్రశంసలు దక్కాయి. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు భారత ప్రభుత్వం విధించిన 21 రోజుల లాక్‌డౌన్‌పై డబ్ల్యూహెచ్‌వోలోని కరోనా వైరస్ ప్రత్యేక రాయబారి డాక్టర్ డేవిడ్ నబారో ప్రశంసలు కురిపించారు. ఇది చాలా ముందుచూపుతో తీసుకున్న నిర్ణయమనీ.. ప్రభుత్వం సరైన సమయంలో సరైన విధంగా స్పందించిందని కొనియాడారు. సాధ్యమైనంత త్వరగా కరోనా మహమ్మారి నుంచి భారత్ బయటపడాలని డాక్టర్ నబారో ఆకాంక్షించారు. కరోనా వైరస్ కథ ఇప్పట్లో ముగుస్తుందని చెప్పలేమన్న ఆయన... భవిష్యత్తులో దీనిపై కొత్త ప్రమాణాలను రచించాల్సి రావచ్చునని పేర్కొన్నారు. ‘‘ఎంత ముందుగా స్పందిస్తే అంత త్వరగా ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలం. భారత్ ముందుగా స్పందించిన కారణంగా దేశం మొత్తానికి ఈ శత్రువు నిజస్వరూపాన్ని తెలుసుకునే అవకాశం కలిగింది. సకాలంలో లాక్‌డౌన్ విధించడం వల్ల క్షేత్రస్థాయిలో సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకునేందుకు అధికారులకు తగినంత సమయం దొరికింది...’’ అని డాక్టర్ నబారో పేర్కొన్నారు. 


లాక్‌డౌన్‌తో పాటు అధికారులు ఇతర కీలక అంశాలపైనా దృష్టి సారించాలని నబారో సూచించారు. సామాజిక స్థాయి ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ, ఆరోగ్య కార్యకర్తలకు అత్యుత్తమ భద్రత ఈ రెండూ.. భారత్‌లో కరోనా వైరస్‌పై పోరాడేందుకు అత్యంత కీలకమైన అంశాలని ఆయన విశ్లేషించారు. కరోనా వైరస్ వ్యాప్తిని సామాజిక స్థాయిలోనే టార్గెట్ చేయాలనీ.. ఇందుకోసం మూడంచెల విధానాన్ని అనుసరించడం అవసరమని నబారో ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ‘‘వైరస్ సోకిన వ్యక్తులను గుర్తించి, వారిని ఐసోలేట్ చేయడం ఇందులో మొదటిది. రెండోది, వైరస్ సోకిన వారితో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించి, క్వారంటైన్ చేయడం. ఇక మూడోది, అత్యంత ముఖ్యమైనది ఏమంటే... వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు అత్యంత వేగంగా స్పందించడం...’’ అని పేర్కొన్నారు. భారత్ సరిగ్గా ఈ విధానాన్నే పాటించిందని నబారో కితాబిచ్చారు. 

Updated Date - 2020-04-03T22:47:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising