శుక్రుడిపై జీవకోటి జాడకు సంకేతం?
ABN, First Publish Date - 2020-09-15T07:18:19+05:30
ముప్పై కాదు.. నలభై కాదు.. ఏకంగా 462 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రత.. వాతావరణమంతా కార్బన్ డయాక్సైడ్‌తో నిండిపోయి ఉండే శుక్రగ్రహంపై మనుషుల జాడ
వాషింగ్టన్ : ముప్పై కాదు.. నలభై కాదు.. ఏకంగా 462 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రత.. వాతావరణమంతా కార్బన్ డయాక్సైడ్‌తో నిండిపోయి ఉండే శుక్రగ్రహంపై మనుషుల జాడ ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. అక్కడ అన్నీ ప్రతికూల పరిస్థితులే ఉన్నప్పటికీ ఒకే ఒక ఆశాదీపం కనిపిస్తోందని.. అదే ‘ఫాస్పైన్ గ్యాస్’ అని వారు చెబుతున్నారు.
చిలీలోని అటకామా ఎడారి, హవాయ్‌లలో ఉన్న భారీ ఖగోళ టెలిస్కో్‌పల ద్వారా శుక్ర గ్రహపు ఎగువ మేఘాలను, వాటి ఉపరితలం నుంచి దాదాపు 60 కిలోమీటర్ల మేర విస్తరించిన వాతావరణాన్ని విశ్లేషించగా ఈవిషయం వెల్లడైందన్నారు. భూమిపైనైతే కుళ్లిపోయిన సేంద్రియ పదార్థాల నుంచి ఫాస్పైన్ గ్యాస్ విడుదలవుతుంది. శుక్రుడిపైనా దాని జాడ ఉందంటే.. అక్కడా జీవకోటి ఉందా అనే సందేహం తలెత్తుతోందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
Updated Date - 2020-09-15T07:18:19+05:30 IST