ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంపీలపై సస్పెన్షన్ వేటు: రూల్ 255 ఏం చెబుతోంది?

ABN, First Publish Date - 2020-09-21T17:27:14+05:30

వివాదాస్పద వ్యవసాయ రంగ బిల్లులపై ఆదివారం రాజ్యసభలో రభస సృష్టించిన ఎనిమిది మంది ఎంపీలను..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ రంగ బిల్లులపై ఆదివారం రాజ్యసభలో రభస సృష్టించిన ఎనిమిది మంది ఎంపీలను సస్పెండ్ చేస్తూ చైర్మన్ ఎం. వెంకయ్య నాయుడు నిర్ణయం తీసుకోవడంపై ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. సస్పెండ్ అయిన సభ్యులు సభ నుంచి బయటికి వెళ్లేందుకు అంగీకరించకపోవడం.. పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగించడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో రాజ్యసభ ఇవాళ పలుమార్లు వాయిదా పడింది. సస్పెండ్ అయిన ఎంపీలు బయటికి వెళ్లాల్సిందేనంటూ ఉపసభాపతి స్పష్టం చేయడం.. అందుకు ప్రతిపక్షాలు ససేమిరా అంటున్న నేపథ్యంలో రాజ్యసభ నియమావళిలోని రూల్ నెంబర్ 255 (సభ్యుడిని ఉపసంహరించడం) మరోసారి తెరమీదికి వచ్చింది. ఈ నిబంధన ప్రకారం... ఎవరైనా సభ్యుడి ప్రవర్తన సరిగా లేదని తనకు అనిపిస్తే అతడిని సభ నుంచి తక్షణమే ఉపసంహరిస్తున్నట్టు చైర్మన్ ఆదేశించవచ్చు. అలాగే బహిష్కరణకు గురైన సభ్యుడు విధిగా ఆ ఆదేశాలను పాటించాల్సి ఉంటుంది. వేటు పడిన రోజు మిగతా సభా కార్యకలాపాల్లో పాల్గొనకుండా సదరు సభ్యుడు స్వచ్ఛందంగా గైర్హాజరు కావాల్సి ఉంటుంది. 

Updated Date - 2020-09-21T17:27:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising