ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నా దగ్గరున్న సమాచారంతోనే మాట్లాడా: సంజయ్ రౌత్

ABN, First Publish Date - 2020-08-12T22:13:30+05:30

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మృతి కేసులో ఆయన బంధువు ఒకరు తనకు ఇచ్చిన నోటీసుపై ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మృతి కేసులో ఆయన బంధువు ఒకరు తనకు ఇచ్చిన నోటీసుపై శివసేన ఎంపీ సంజయ్ రౌట్ స్పందించారు. తన దగ్గరున్న సమాచారం ఆధారంగానే తాను మాట్లాడానని, ఆ సమాచారంలో ఏదైనా లోపించి ఉంటే ఆ విషయంపై దృష్టా సారిస్తానని చెప్పారు.


'మా వైపు నుంచి సమాచారం ఏదైనా లోపించినట్లయితే దానిపై ఆలోచిస్తాం. ఇంతవరకూ నేను ఏదైతే చెప్పానో అదంతా నా దగ్గరున్న సమాచారం బట్టే చెప్పాను. అలాగే సుశాంత్ కుటుంబం కూడా వారి వద్దనున్న సమాచారం ఆధారంగానే మాట్లాడి ఉండొచ్చు' అని సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.


దీనికి ముందు, సుశాంత్ సింగ్ బంధువు, బీజేపీ ఎమ్మెల్యే నీరజ్ కుమార్ తరపు లాయర్ అనిష్ ఝా మాట్లాడుతూ, సుశాంత్ మృతి కేసుకు సంబంధించిన చేసిన వ్యాఖ్యలకు గాను ఆయన కుటుంబానికి సంజయ్ రౌత్ 48 గంటల్లో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో చట్టపరమైన చర్యలు ఎదుర్కోవలసి ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారని, అందుకే తాము నోటీసులు పంపుతున్నామని చెప్పారు.  సుశాంత్, ఆయన తండ్రి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని సంజయ్ రావత్ ఇంతకుముందు ఆరోపించారు. దీనిపై సుశాంత్ కుటుంబ సభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. బీహార్ డీజీపీపైనా రావత్ ఆరోపణలు చేశారు. ఓ పార్టీ ప్రతినిధిలా మాట్లాడుతున్నారంటూ విమర్శించారు.

Updated Date - 2020-08-12T22:13:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising