ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వారికేం చేస్తున్నారు ? ప్రభుత్వాలకు సుప్రీం ప్రశ్న

ABN, First Publish Date - 2020-05-28T23:06:31+05:30

ప్రత్యేక రైళ్లలో ప్రయాణిస్తున్న వలస కార్మికులకు సాయం చేయటానికి ఏం చర్యలు చేపట్టారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా... ఆహారం, నిధులు, వసతి, రవాణా సదుపాయాలకు సంబంధించిన మొత్తం ఏర్పాట్ల గురించి ఈ సందర్భంగా పలు ప్రశ్నలను ఎదుర్కోవాల్సి వచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ప్రత్యేక రైళ్లలో ప్రయాణిస్తున్న వలస కార్మికులకు సాయం చేయటానికి ఏం చర్యలు చేపట్టారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా... ఆహారం, నిధులు, వసతి, రవాణా సదుపాయాలకు సంబంధించిన మొత్తం ఏర్పాట్ల గురించి ఈ సందర్భంగా పలు ప్రశ్నలను ఎదుర్కోవాల్సి వచ్చింది.


త్రిసభ్య ధర్మాసనం దాదాపు 50 ప్రశ్నలనడిగింది. ‘స్వస్థలాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న వలస కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలు మాకు ఆందోళన కలిగిస్తున్నాయి. వారికి రిజిస్ట్రేషన్, రవాణా, ఆహారం, తాగునీరు అందించటంలో పలు లోపాలను మేం గుర్తించాం'’ అని ధర్మాసనం పేర్కొంది.


కేంద్ర ప్రభుత్వం తరఫున తుషార్ మెహతా వివరణ ఇస్తూ ఇప్పటివరకూ నడిపిన రైళ్లు, తరలించిన వలస కార్మికులు, వారికందించిన ఆహారం గురించి కొన్ని గణాంకాలను వివరించిన తర్వాత... 'ప్రభుత్వం పెద్ద సంఖ్యలో చర్యలు చేపట్టింది. వాటిపట్ల సుప్రీంకోర్టు ఇంతకుముందు సంతృప్తి చెందింది' అని చెప్పారు.


'అంతామునిగిపోతోందని జోస్యం చెప్పేవారు దీనిని రాజకీయ ప్రసంగాలకు వేదికగా వాడుకోవటానికి కోర్టు అనుమతించరాద‘ అని కేంద్రం పేర్కొంది. కాగా... తమ వాదన వినాలని అంటున్నవారు వలస కార్మికుల కోసం ఏం చేశారో అఫిడవిట్లు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. 


తదుపరి విచారణను జూన్ 5 వ తేదీకి వాయిదా వేసింది.

Updated Date - 2020-05-28T23:06:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising