ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శృంగార సమయంలోనూ మాస్క్ తప్పనిసరి: కెనడా డాక్టర్

ABN, First Publish Date - 2020-09-04T02:33:12+05:30

కొత్త భాగస్వాములతో శృంగారం చాలా ప్రమాదనమని, అలాంటి సమయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ థెరెసా అంటున్నారు. ముఖ్యంగా ముద్దు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒట్టావా: కరోనా నేపథ్యంలో ఇంటా-బయట మాస్క్ పెట్టుకోమని ప్రభుత్వం పదే పదే చెబుతూనే ఉంది. అయితే శృంగార సమయంలో కూడా మాస్క్ తప్పనిసరి అంటున్నారు కెనడాకు చెందిన ఛీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ థెరెసా టాం. అంతే కాదండోయ్.. ఆ సమయంలో ముద్దు పెట్టుకోవద్దని, ఇరు ముఖాల్ని సైతం దగ్గరగా రాకుండా చూసుకోవాలని హెచ్చరిస్తున్నారు. కోవిడ్-19 ప్రభావం ఏమాత్రం తగ్గని ఈ పరిస్థితిలో వీలైనన్నీ పరిమితులతో శృంగారంలో పాల్గొనడం మంచిదని సలహా ఇస్తున్నారు.


కొత్త భాగస్వాములతో శృంగారం చాలా ప్రమాదనమని, అలాంటి సమయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ థెరెసా అంటున్నారు. ముఖ్యంగా ముద్దు వంటి సన్నిహిత సంబంధాలను దూరం పెట్టడమే మంచిదని ఆమె చెప్పుకొచ్చారు. వైరస్ వ్యాప్తికి భౌతికదూరం ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉంటుందని, శృంగారంలో భౌతిక దూరానికి తావు లేకపోవడం వల్ల.. కనీసం మాస్కులైనా ధరించి వైరస్ వ్యాప్తిని నిరోధించాలని అన్నారు.

Updated Date - 2020-09-04T02:33:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising