ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాగు చట్టాల్ని రద్దు చేస్తాం

ABN, First Publish Date - 2020-10-18T07:37:01+05:30

అధికారంలోకొస్తే కేంద్రం ఇటీవల చేసిన వ్యవసాయ చట్టాల్ని రద్దు చేస్తామని బిహార్‌లోని మహాకూటమి తన ఎన్నికల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

10లక్షల ఉద్యోగాలిస్తాం

బిహార్‌ మహాకూటమి మేనిఫెస్టో హామీలు

పట్నా/న్యూఢిల్లీ, అక్టోబరు 17: అధికారంలోకొస్తే కేంద్రం ఇటీవల చేసిన వ్యవసాయ చట్టాల్ని రద్దు చేస్తామని బిహార్‌లోని మహాకూటమి తన ఎన్నికల హామీపత్రంలో పేర్కొంది. ఈ మేనిఫెస్టోను శనివారంనాడు కూటమి తరఫు ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్‌, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి రణదీప్‌ సూర్జేవాలా విడుదల చేశారు.


సాగు చట్టాల వల్ల బిహార్‌ రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని వారు పేర్కొన్నారు. అధికారాన్నిస్తే 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, అనేక మంది కాంట్రాక్ట్‌ టీచర్లకు - సేమ్‌ వర్క్‌ సేమ్‌ పే విధానాన్ని అమలు చేస్తామని కూడా హామీ ఇచ్చారు. ’ఏదో ఎన్నికల సమయంలో హామీలిచ్చి తరువాత వాటి గురించి మర్చిపోయే రాజకీయ నేతలం మేం కాదు. బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఏళ్లతరబడి అడుగుతున్నాం. నేటికీ నెరవేరలేదు.


ప్రధాని మోదీ ఈ హోదా ఇస్తామని చెప్పారు. ఏదీ..? డొనాల్ట్‌ ట్రంప్‌ వచ్చి బిహార్‌కు స్పెషల్‌ స్టేటస్‌ ఇవ్వరు కద..!’’ అని తేజస్వీ యాదవ్‌ వ్యంగ్యంగా అన్నారు. మరోవైపు బీజేపీ.... దమ్ముంటే ఆర్టికల్‌ 370ని పునరుద్ధరిస్తామన్న విషయాన్ని కాంగ్రెస్‌ భాగస్వామిగా ఉన్న మహాకూటమి తన మేనిఫెస్టోలో చేర్చాలని సవాల్‌ విసిరింది. 


Updated Date - 2020-10-18T07:37:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising