ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కలెక్టర్‌ను సస్పెండ్ చేయాల్సిందే: హాథ్రస్ బాధిత బాలిక సోదరుడి డిమాండ్

ABN, First Publish Date - 2020-10-04T22:00:35+05:30

హాథ్రస్ సామూహిక అత్యాచార ఘటన ప్రకంపనలు ఇంకా రేగుతూనే ఉన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తూనే ఉన్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: హాథ్రస్ సామూహిక అత్యాచార ఘటన ప్రకంపనలు ఇంకా రేగుతూనే ఉన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తూనే ఉన్నాయి. తాజాగా, బాధితురాలి సోదరుడు మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ (డీఎం)ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల బృందం (సిట్) నుంచి పలు ప్రశ్నలకు సమాధానాలు కోరినట్టు చెప్పారు. తన సోదరికి రాత్రికి రాత్రే ఎందుకు అంత్యక్రియలు నిర్వహించారో చెప్పాలని ప్రశ్నించారు.


గత రెండు రోజులుగా తమను ఇళ్లలోనే బందీలుగా చేశారని, తమపై డీఎం ఒత్తిడి తీసుకొచ్చారని అన్నారు. ‘‘మేం వారిని పలు ప్రశ్నలు అడిగాం. మా సోదరి మృతదేహానికి రాత్రికి రాత్రే దహన సంస్కారాలు నిర్వహించారు. మాకు సమాధానాలు కావాలి. ఆసుపత్రి నుంచి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత మాకెందుకు తెలియజేయలేదు. మేం ఆందోళన చేపడతామని అంటున్నారు. కానీ మేం నిరసన వ్యక్తం చేయకపోతే మాకు న్యాయం జరగదు. మాతో డీఎం ఎంత దారుణంగా ప్రవర్తించారో మీరు చూశారు. మా గొంతు నొక్కాలని చూస్తున్నారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.   


Updated Date - 2020-10-04T22:00:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising