ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూలనున్న శవాల గుట్టల్ని పట్టించుకోవద్దని చెప్పలేం కదా: బిల్ గేట్స్

ABN, First Publish Date - 2020-03-25T21:25:37+05:30

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచనలతో ఏకభవించని వారి జాబితాలోకి తాజాగా అపర కుబేరుడు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ వచ్చిచేరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచనలతో ఏకభవించని వారి జాబితాలోకి తాజాగా అపర కుబేరుడు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ వచ్చిచేరారు. అమెరికా ప్రస్తుతం 15 రోజుల పాటు ఆంక్షలు అమలవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ కఠిన నిబంధనలు ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో ట్రంప్ ఓ వివాదాస్పద వ్యాఖ్య చేశారు. వీలైనంత త్వరగా ప్రజలు పనుల్లోకి దిగాలని సూచించారు. దీనిపై శాస్త్రవేత్తల నుంచి వ్యాపారవేత్తల వరకూ అనేక మంది మండిపడుతున్నారు. తాజాగా బిల్ గేట్స్ కూడా తన అభిప్రాయాల్ని సూటిగా వ్యక్తం చేశారు.  


‘అంతా అనుకున్నట్టు జరిగితేనే  6 నుంచి 10 వారాల్లో పరిస్థితి కుదుట పడుతుంది. ఓ పక్క పేరుకుంటున్న శవాల గుట్టల్ని పట్టించుకోకుండా సాధారణ పరిస్థితికి వెళ్లలేం కదా. అసలు ఈ పరిస్థితిల్లో.. మామూలుగా పనుల్లోకి దిగండని ప్రజలను కోరడం చాలా కష్టం. రెస్టారంట్లను తెరిచిపెట్టండి..ఇళ్లు కొనుక్కోండి..పక్కన పేరుకుంటున్న శవాల గుట్టలను మాత్రం పట్టించుకోకండి. వీలైనంతా కర్చు పెట్టండి.. జీడీపీ వృద్ధి రేటే అన్నికంటే ముఖ్యమని ఓ రాజకీయ నాయకుడు భావించాడు కాబట్టి మీరు ఇవ్వన్నీ చేయాలని ప్రజలు చెప్పలేం కదా? ఆర్థిక వ్యవస్థను తిరిగి నిర్మించుకోగలం కానీ పోయిన వారిని తిరిగి తెచ్చుకోలేం’ అని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. 


Updated Date - 2020-03-25T21:25:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising