ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారతీయ సందర్శకులకు ఐడీ కార్డుల విధానం తెస్తాం : నేపాల్ హోం మంత్రి

ABN, First Publish Date - 2020-08-13T01:56:01+05:30

కోవిడ్-19 మహమ్మారిని దీటుగా ఎదుర్కొనేందుకు పటిష్ట చర్యలు అమలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖాట్మండు : కోవిడ్-19 మహమ్మారిని దీటుగా ఎదుర్కొనేందుకు పటిష్ట చర్యలు అమలు చేస్తున్నామని నేపాల్ హోం మంత్రి రామ్ బహదూర్ థాపా చెప్పారు. భారత దేశం నుంచి నేపాల్ వచ్చేవారిని తమ గుర్తింపు కార్డులను చూపించాలని కోరుతామని చెప్పారు. ఈ వివరాలను పార్లమెంటరీ ప్యానెల్‌కు తెలిపారు. 


రాజ్య నిర్వహణ, సుపరిపాలనపై పార్లమెంటరీ ప్యానెల్‌ సమక్షంలో హోం మంత్రి రామ్ బహదూర్ మాట్లాడుతూ, ప్రజల రాకపోకలు, కోవిడ్-19 మహమ్మారికి సంబంధించిన సమాచారం శాశ్వతంగా ఉండేవిధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గుర్తింపు కార్డుల జారీ, రిజిస్ట్రేషన్ సిస్టమ్ వంటివాటిని అమలు చేస్తామని తెలిపారు. ఈ సమాచారం మెరుగైన రీతిలో నమోదయ్యేలా చూస్తామని చెప్పారు. 


ఇదిలావుండగా, నేపాల్ ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలీ ఇటీవల మాట్లాడుతూ, ఆ దేశంలో కోవిడ్-19 వ్యాపించడానికి కారణం భారత దేశమేనని ఆరోపించారు. 


ఇప్పటి వరకు భారతీయులు నేపాల్‌లోకి నిరభ్యంతరంగా రాకపోకలు సాగిస్తున్నారు. నేపాల్ ఐడీ కార్డుల విధానాన్ని అమలు చేస్తే, ఈ రాకపోకలపై కట్టుదిట్టమైన ఆంక్షలు అమలు చేస్తున్నట్లే భావించాలి. 


Updated Date - 2020-08-13T01:56:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising