ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎడతెరిపి లేని వర్షాలతో పెరిగిన బ్రహ్మపుత్ర నీటి మట్టం

ABN, First Publish Date - 2020-05-24T03:49:49+05:30

ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తుండటంతో అస్సాంలోని బ్రహ్మపుత్ర నది నీటి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తుండటంతో అస్సాంలోని బ్రహ్మపుత్ర నది నీటి మట్టం పెరుగుతోంది. సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారి ఎస్‌సీ కలిత మాట్లాడుతూ ఈ నెల 16 నుంచి బ్రహ్మపుత్ర నది నీటి మట్టం క్రమంగా పెరుగుతున్నట్లు తెలిపారు. 


ఈ ప్రాంతంలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తుండటమే దీనికి కారణమని కలిత తెలిపారు. ప్రతి రెండు, మూడు గంటలకు 1 నుంచి 2 సెంటీమీటర్ల వరకు నీటి మట్టం పెరుగుతోందన్నారు. 


అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ శుక్రవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం, బ్రహ్మపుత్ర నదికి ఉప నది అయిన జియా భారతి నది ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తోంది. 


బ్రహ్మపుత్ర నది నీటి మట్టం పెరుగుతుండటంతో బార్‌పేట జిల్లాలోని 630 మందిపై ప్రభావం పడిందని అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ పేర్కొంది. దరంగ్, నగావోన్ జిల్లాల్లోని 15 గ్రామాలు ప్రభావితమైనట్లు తెలిపింది.


Updated Date - 2020-05-24T03:49:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising