ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చర్చలు చాలు.. లిఖిత పూర్వక హామీ కావాలి : రైతు సంఘాలు

ABN, First Publish Date - 2020-12-05T21:50:16+05:30

నూతన వ్యవసాయ చట్టాలపై రైతులతో చర్చించడానికి తమకేమీ అహంకారం లేదని, చర్చలకు సదా సిద్ధమేనని కేంద్ర వ్యవసాయ మంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : నూతన వ్యవసాయ చట్టాలపై రైతులతో చర్చించడానికి తమకేమీ అహంకారం లేదని, చర్చలకు సదా సిద్ధమేనని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ శనివారం పునరుద్ఘాటించారు. కనీస మద్దతు ధర విషయంలోనూ తాము హామీ ఇవ్వడానికి సిద్ధమేనని పేర్కొన్నారు. మరోవైపు తమ డిమాండ్ల విషయంలో ప్రభుత్వం మాటిస్తే సరిపోదని, లిఖిత పూర్వకంగా హమీ ఇవ్వాల్సిందేనని రైతు సంఘాల నేతలు తెగేసి చెబుతున్నారు. ‘‘ఇక ప్రభుత్వంతో చర్చలు అనవసరం. ప్రభుత్వం లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వాలి. ఇప్పటి వరకూ చాలా చర్చలే జరిగాయి.’’ అని రైతు సంఘాల నేతలు పేర్కొంటున్నారు. రైతు ఆందోళనలు ఉధృతమైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. వ్యవసాయ చట్టాలను సవరించాలని ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పంటల మద్దతు ధరకు హామీ, ప్రభుత్వ మార్కెట్ వ్యవస్థ బలోపేతంతో పాటు కాంట్రాక్టు వ్యవసాయానికి సంబంధించి సమస్యలు వస్తే సివిల్ కోర్టులకు వెళ్లే అవకాశం కల్పించే అవకాశాలపై కేంద్రం దిగొచ్చే అవకాశముందని ఢిల్లీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ విషయంపై న్యాయ శాఖతో కూడా వ్యవసాయ శాఖ చర్చలు జరిపినట్లు సమాచారం. 

Updated Date - 2020-12-05T21:50:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising