ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓటర్ ఐడీ కార్డులు కూడా డిజిటల్ కాబోతున్నాయ్!

ABN, First Publish Date - 2020-12-11T17:13:57+05:30

ఓటర్ గుర్తింపు కార్డులు కూడా డిజిటైజేషన్ బాట పట్టబోతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఓటర్ గుర్తింపు కార్డులు కూడా డిజిటైజేషన్ బాట పట్టబోతున్నాయి. ఆధార్ కార్డు తరహాలోనే ఓటర్ ఐడీ కార్డులను కూడా డిజిటల్ రూపంలో అందజేయబోతున్నారు. వచ్చే ఏడాది 5 రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికల జరగబోతున్న సమయంలో, అంతకు ముందే ఈ ప్రక్రియను పూర్తి చేయబోతున్నారు. ఎన్నికల కమిషన్ వర్గాలను ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ ఈ వివరాలను వెల్లడించింది. 


ఈ వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, ఓటరు గుర్తింపు కార్డులను డిజిటైజేషన్ చేయాలని ఎన్నికల కమిషన్ (ఈసీ) ప్రయత్నిస్తోంది. ఈ విధానం అమల్లోకి వస్తే, ఓటర్లు తమ ఐడీ కార్డులను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కలుగుతుంది. కొత్తగా నమోదయ్యే ఓటర్ల ఐడీ కార్డులు ఆటోమేటిక్‌గానే జనరేట్ అవుతాయి. ప్రస్తుత ఓటర్లు ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ ద్వారా కొన్ని లాంఛనాలను పూర్తి చేసిన తర్వాత, గుర్తింపు కార్డులు జనరేట్ అవుతాయి. 


2021 ఏప్రిల్, మే నెలల్లో అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ శాసన సభలకు ఎన్నికలు జరుగుతాయి. 


Updated Date - 2020-12-11T17:13:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising