ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పన్ను వివాదంలో భారత్‌పై వొడాఫోన్ విజయం

ABN, First Publish Date - 2020-09-25T23:30:53+05:30

గత కాలానికి వర్తించే పన్ను వివాదం కేసులో భారత ప్రభుత్వంపై వొడాఫోన్ గ్రూప్ గెలిచినట్లు ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ తెలిపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : గత కాలానికి వర్తించే పన్ను వివాదం కేసులో భారత ప్రభుత్వంపై వొడాఫోన్ గ్రూప్ గెలిచినట్లు ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ తెలిపింది. రూ.20,000 కోట్ల పన్నుకు సంబంధించిన ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ కేసులో వొడాఫోన్ విజయం సాధించిందని తెలిపింది. హేగ్‌లోని అంతర్జాతీయ మధ్యవర్తిత్వ ట్రైబ్యునల్ ఈ తీర్పు ఇచ్చినట్లు పేర్కొంది. 


వొడాఫోన్‌పై భారత ప్రభుత్వం విధించిన పన్ను, వడ్డీ, జరిమానాలు భారత్-నెదర్లాండ్స్ మధ్య కుదిరిన పెట్టుబడుల ఒప్పందానికి విరుద్ధంగా ఉన్నట్లు ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ట్రైబ్యునల్ తీర్పు చెప్పినట్లు పేర్కొంది. 


ఈ సొమ్ము చెల్లించాలని వొడాఫోన్‌ను కోరకూడదని, కోర్టు ఖర్చుల కోసం పాక్షిక నష్టపరిహారంగా 5.47 మిలియన్ డాలర్లు వొడాఫోన్‌కు చెల్లించాలని భారత ప్రభుత్వాన్ని ట్రైబ్యునల్ ఆదేశించినట్లు తెలిపింది. 


అయితే ఈ వార్తలపై వొడాఫోన్, భారత ప్రభుత్వం స్పందించలేదని ఆ వార్తా సంస్థ తెలిపింది. 

Updated Date - 2020-09-25T23:30:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising