ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘‘సామాజిక దూరం పాటించక పోవడం హరామ్’’

ABN, First Publish Date - 2020-04-03T15:53:58+05:30

దేశంలో కరోనా వైరస్ ప్రబలుతున్న తరుణంలో నమాజ్ పేరిట సామాజిక దూరం పాటించాలనే నిబంధనను ఉల్లంఘించడం ఇస్లాం ప్రకారం హరామ్....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జమాతే ఉలేమా -ఈ- హింద్ చీఫ్ సెక్రటరీ జనరల్ మౌలానా మహమూద్ మదానీ

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ ప్రబలుతున్న తరుణంలో నమాజ్ పేరిట సామాజిక దూరం పాటించాలనే నిబంధనను ఉల్లంఘించడం ఇస్లాం ప్రకారం హరామ్ అని జమాత్ ఉలేమా-ఇ-హింద్ సెక్రటరీ జనరల్ మౌలానా మహమూద్ మదానీ చెప్పారు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా సర్కారు చేసే ప్రయత్నాల్లో భారతీయ ముస్లిములు ఐక్యంగా మద్ధతు ఇస్తున్నారని మదానీ పేర్కొన్నారు.


‘‘భారతదేశంలో పదిలక్షల మసీదులున్నాయని, వీటిలో కొద్దిమంది తప్ప అందరూ కరోనా వైరస్ నివారణకు ప్రభుత్వ లాక్ డౌన్ ఆదేశాలను పాటిస్తున్నారని, ముస్లిములంతా వంద శాతం సర్కారుతోనే ఉన్నారు’’ అని మౌలానా మదానీ చెప్పారు. ప్రభుత్వం మానవత్వంతో జమాత్ సభ్యులకు వైద్యం అందించాలని కోరారు. జమాత్ సభ్యులు కూడా ముందుకు వచ్చి వైద్యచికిత్స పొందాలని సూచించారు.


అజ్ఞాతంలో ఉన్న జమాత్ కార్యకర్తలందరూ బయటకు వచ్చి చికిత్స పొందాలని మదానీ సూచించారు.తబ్లిగ్ జమాత్ కార్యకర్తలు వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలపై దాడులు చేయరాదని, చట్టం ప్రకారం వారిని గౌరవించాలని మదానీ కోరారు. వైద్యులపై దాడి చేయడం నేరం, చికిత్స చేసే వైద్యులను గౌరవించాలని ఆయన కోరారు.‘‘ఎవరైనా సామాజిక దూరం పాటించకపోతే అది అల్లాహ్‌ను కలవరపెడుతుంది. ఒక ముస్లిం తనను తాను లేదా మరొకరిని ప్రమాదంలో పడేయడం హరామ్" అని మౌలానా మదానీ వివరించారు. 

Updated Date - 2020-04-03T15:53:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising