ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫ్లాష్..ఫ్లాష్..గ్యాంగ్‌స్టర్ వికాస్‌దూబే ఎన్‌కౌంటర్

ABN, First Publish Date - 2020-07-10T13:32:39+05:30

కరడుకట్టిన కాన్పూర్ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబేను స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం ఉదయం కాల్చి చంపారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాన్పూర్ (ఉత్తరప్రదేశ్): కరడుకట్టిన కాన్పూర్ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబేను స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం ఉదయం కాల్చి చంపారు. దూబే పారిపోతుండగా పోలీసులు జరిపిన కాల్పుల్లో మరణించాడని సమాచారం. కరడుకట్టిన గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబేను ఉజ్జయిని నుంచి కాన్పూర్ నగరానికి తీసుకువస్తున్న కారు శుక్రవారం ఉదయం ప్రమాదవశాత్తూ బోల్తాపడింది. భారీ వర్షం కురుస్తుండటంతోపాటు రోడ్డు సరిగా లేకపోవడం వల్ల కారు ప్రమాదానికి గురై బోల్తా పడిందని యూపీ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు చెప్పారు. కారు ప్రమాదవశాత్తూ బోల్తా పడగానే గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. దూబే ప్రయాణిస్తున్న కారు బోల్తా పడిన ప్రదేశంలో కాల్పుల శబ్ధం వినిపించిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు వెల్లడించారు. 


దూబే కాల్పుల్లో నలుగురు పోలీసులకు గాయాలు 

 గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ప్రయాణిస్తున్న కారు కాన్పూరులోని సచెండీ సరిహద్దు వద్దకు రాగానే ప్రమాదానికి గురవడంతో అతను పోలీసు నుంచి తుపాకీ లాక్కోని కాల్పులు జరుపుతూ పారిపోయేందుకు యత్నించాడు. దీంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో దూబే మరణించాడు. కారు బోల్తా పడగానే బయటకు వచ్చిన దూబే పోలీసు నుంచి పిస్టల్ లాక్కోని పారిపోయేందుకు యత్నించాడు. దూబే జరిపిన కాల్పుల్లో నలుగురు పోలీసులు గాయపడ్డారని కాన్పూర్ ఎస్పీ చెప్పారు. గాయపడిన పోలీసులను ఆసుపత్రికి తరలించారు. 



Updated Date - 2020-07-10T13:32:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising