ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బిహార్ స్పీకర్‌గా ఎన్నికైన ఎన్డీయే అభ్యర్థి విజయ సిన్హా

ABN, First Publish Date - 2020-11-25T19:03:38+05:30

జైలు నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. స్పీకర్ ఎన్నిక విషయంలో తమకు మద్దతివ్వాలన్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాట్నా : జైలు నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. స్పీకర్ ఎన్నిక విషయంలో తమకు మద్దతివ్వాలన్న లాలూ కోరికను ఎన్డీయే ఎమ్మెల్యేలు అసలు లెక్కలోకే తీసుకోలేదు. బిహార్ అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్డీయే అభ్యర్థి విజయ సిన్హా ఎన్నికయ్యారు. స్పీకర్ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి విజయ సిన్హాకు 126 ఓట్లు లభిస్తే, మహాఘట్ బంధన్ అభ్యర్థి అవధ్ బిహారీ చౌధురికి 114 ఓట్లు వచ్చాయి. విజయ సిన్హా స్పీకర్‌గా ఎన్నికైన తర్వాత సంప్రదాయం ప్రకారం సీఎం నితీశ్, విపక్ష నేత తేజస్వీ యాదవ్ మర్యాద పూర్వకంగా ఆయన్ను స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు. అయితే స్పీకర్ ఎన్నిక జరుగుతున్న సమయంలో బిహార్ అసెంబ్లీలో దుమారం రేగింది. అసెంబ్లీలో సభ్యులు కానివారు స్పీకర్ ఎన్నిక సమయంలో అసెంబ్లీలో ఉన్నారని, అలాంటి వారు సభలో ఉండకూడదంటూ సీఎం నితీశ్‌ను ఉద్దేశించి తేజస్వీ యాదవ్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా రూల్ బుక్ చూసుకోవాలంటూ ప్రొటెం స్పీకర్ జితిన్‌రాం మాంఝీని ఆయన డిమాండ్ చేశారు. దీంతో ప్రొటెం స్పీకర్ మాంఝీ బదులిస్తూ.... ‘‘మండలికి చెందిన సభ్యులు ఓటు వేయడానికి వీల్లేదు. కానీ... సభలో ఉండొచ్చు. ఇబ్బందేమీ కాదు..’’ అంటూ వ్యాఖ్యానించారు. 

Updated Date - 2020-11-25T19:03:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising