ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏ క్షణమైనా భారత్‌కు విజయ్‌ మాల్యా

ABN, First Publish Date - 2020-06-04T07:15:50+05:30

పరారీలో ఉన్న ప్రముఖ లిక్కర్‌ వ్యాపారి విజయ్‌ మాల్యా కథ క్లైమాక్స్‌కు చేరింది. బ్యాంకులకు 9 వేల కోట్ల రూపాయలకు పైగా ఎగవేసి 2016లో బ్రిటన్‌కు పారిపోయిన ఆయనను ఏ క్షణమైనా భారత్‌కు తీసుకొచ్చే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • బ్రిటన్‌ సుప్రీంలో కేసు ఓడిపోయిన లిక్కర్‌ వ్యాపారి

న్యూఢిల్లీ, జూన్‌ 3: పరారీలో ఉన్న ప్రముఖ లిక్కర్‌ వ్యాపారి విజయ్‌ మాల్యా కథ క్లైమాక్స్‌కు చేరింది. బ్యాంకులకు 9 వేల కోట్ల రూపాయలకు పైగా ఎగవేసి 2016లో బ్రిటన్‌కు పారిపోయిన ఆయనను ఏ క్షణమైనా భారత్‌కు తీసుకొచ్చే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారత్‌కు పంపించొద్దంటూ మాల్యా పెట్టుకున్న అప్పీల్‌ను బ్రిటన్‌ సుప్రీంకోర్టు మే 14వ తేదీన కొట్టివేయడంతో ఆయనకు అన్ని దారులూ మూసుకుపోయాయని ఓ ఉన్నతాధికారి తెలిపారు. బ్రిటన్‌ ఆర్థిక మంత్రి ప్రీతిపటేల్‌ సంతకం చేయగానే ఆయన్ను భారత్‌కు అప్పగిస్తారు.


మాల్యాను మోదీ సర్కారు 28 రోజుల్లో భారత్‌కు తేవాల్సి ఉందని, ఇప్పటికే 20 రోజులు గడిచిపోయాయని, ఏ తేదీన మాల్యాను తరలిస్తారన్న దానిపై మాత్రం ఆయన పెదవి విప్పలేదు. విజయ్‌ మాల్యాపై ముంబైలో కేసు నమోదై ఉండటంతో ఆయనను లండన్‌ నుంచి నేరుగా ఇక్కడికే తీసుకొస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 


Updated Date - 2020-06-04T07:15:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising