ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శాంతియుత జీవనంతోనే అభివృద్ధి: వెంకయ్య

ABN, First Publish Date - 2020-02-22T08:58:24+05:30

నేటి సమాజంలో అవినీతి, అశాంతి, కులవివక్ష, నిరక్షరాస్యత, పేదరికం పెనుసవాళ్లుగా మారాయని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): నేటి సమాజంలో అవినీతి, అశాంతి, కులవివక్ష, నిరక్షరాస్యత, పేదరికం పెనుసవాళ్లుగా మారాయని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. వీటిపై పోరాటం చేయడం ద్వారా నవభారత నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తమిళనాట కోయంబత్తూరులోని ప్రసిద్ధ ఈషా యోగా కేంద్రంలో మహాశివరాత్రి వేడుకలు శుక్రవారం రాత్రి అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న వెంకయ్య మాట్లాడుతూ శాంతియుత వాతావరణంలోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. వేడుకల్లో భాగంగా సద్గురు జగ్గీ వాసుదేవ్‌ రాసిన ‘డెత్‌- యాన్‌ ఇన్‌సైడ్‌ స్టోరీ’ పుస్తకాన్ని వెంకయ్య ఆవిష్కరించారు. అంతకుముందు ఉప రాష్ట్రపతికి స్వాగతం పలుకుతూ ఈషా సంస్కృతి చిన్నారులు ఆదిశంకరాచార్య రాసిన నిర్వాణ శతకాన్ని పారాయణం చేశారు. అనంతరం ధ్యానలింగం వద్ద వెంకయ్య పంచభూత ఆరాధన జరిపారు. లింగ భైరవి, ధ్యానలింగ యోగా ఆలయాన్ని సందర్శించి, ఆదియోగి విగ్రహం వద్దకు చేరుకుని జ్యోతిని వెలిగించారు.  

Updated Date - 2020-02-22T08:58:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising