ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లవ్ జీహాద్‌ ఆర్డినెన్స్ కింద తొలి కేసు... యూపీ సర్కార్‌కు వీహెచ్‌పీ అభినందనలు!

ABN, First Publish Date - 2020-11-30T04:57:29+05:30

యోగి ఆదిత్యనాధ్ నేతృత్వంలోని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) అంతర్జాతీయ కార్యనిర్వాహక ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: యోగి ఆదిత్యనాధ్ నేతృత్వంలోని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్ కుమార్ అభినందనలు తెలిపారు. ఇటీవల యూపీ కేబినెట్ అమోదించిన ‘‘ఉత్తర ప్రదేశ్ చట్టవిరుద్ధ మతమార్పిడి నిరోధక’’ ఆర్డినెన్స్-2020 కింద తొలి కేసు నమోదు కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.  ‘‘లవ్ జీహాద్‌పై శక్తవంతమై చట్టం తీసుకు వచ్చిన తొలి రాష్ట్రంగా యూపీ నిలిచింది. దీనికి గానూ యోగి ఆదిత్యనాధ్‌కు అభినందనలు...’’ అని ఆయన పేర్కొన్నారు. కాగా అంతకు ముందు ఈ నూతన చట్టం కింద బరేలీలోని డ్యోరానియా పోలీస్టేషన్‌లో ఓ కేసు నమోదైంది. ఈ కేసులోని నిందితుడు ఓ మహిళను బలవంతంగా మతమార్పిడి చేయబోయాడని పోలీసులు ఆరోపించారు. యూపీ సహా పలు రాష్ట్రాల్లో బలవంతపు మతమార్పిడి యధేచ్చగా సాగుతోందనీ.. ఇకపై దీన్ని సహించేది లేదని అలోక్ కుమార్ పేర్కొన్నారు. 

Updated Date - 2020-11-30T04:57:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising