ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రముఖ బెంగాలీ నటుడు కన్నుమూత

ABN, First Publish Date - 2020-12-07T01:15:25+05:30

ప్రముఖ బెంగాలీ నటుడు మను ముఖర్జీ ఆదివారంనాడు గుండెపోటుతో కన్నుమూసినట్టు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: ప్రముఖ బెంగాలీ నటుడు మను ముఖర్జీ ఆదివారంనాడు గుండెపోటుతో కన్నుమూసినట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ముఖర్జీ వయస్సు 90 సంవత్సరాలు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ముఖర్జీ తన సినీ కెరీర్‌ను మృణాల్ సేన్ తీసిన 'నీల్ ఆకాషెర్ నీచే' (నీలాకాశం కింద- 1958)) చిత్రంతో ప్రారంభించారు. సత్యజిత్ రే తీసిన 'జాయ్ బాబా ఫెలూనాథ్', 'గనశత్రు' వంటి చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలకు మంచి గుర్తింపు వచ్చింది. బాలల ఫాంటసీ చిత్రం 'పాతాళ్‌ఘర్'‌లోనూ ఆయన నటనా సామర్థ్యం ప్రశంసలు అందుకుంది.


మను ముఖర్జీ మృతికి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక ట్వీట్‌లో సంతాపం తెలిపారు. ముఖర్జీ మృతి విషాదకరమని, 2015లో ఆయనకు లైవ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును తాము ప్రదానం చేశామని గుర్తు చేసుకున్నారు. ముఖర్జీ కుటుంబ సభ్యులు, అభిమానులకు సంతాపం తెలియజేశారు. వెస్ట్ బెంగాల్ మోషన్ పిక్చర్స్ ఆర్టిస్ట్స్ ఫోరం సైతం సంతాపం ప్రకటించింది. దర్శకుడు అటను ఘోష్, నటులు సుజన్ నీల్ ముఖర్జీ, శాశ్వత ఛటర్జీ తదితరులు ముఖర్జీతో తమ అనుబంధాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.

Updated Date - 2020-12-07T01:15:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising