రాష్ట్రపతి కోవింద్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు: వెంకయ్యనాయుడు
ABN, First Publish Date - 2020-10-01T17:12:23+05:30
ఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
ఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు మంచి ఆరోగ్యం లభించాలని అభిలషించారు. ‘‘ గౌరవనీయ భారత రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ గారికి ఆయన పుట్టినరోజు సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయన సింప్లిసిటీ, విజన్, ఆదర్శప్రాయమైన నాయకత్వం, పేదల పట్ల అత్యంత శ్రద్ధను కనబరుస్తారు. ఆయన మంచి ఆరోగ్యంతో నిండు నూరేళ్లూ జీవించాలని కోరుకుంటున్నా’’ అని వెంకయ్యనాయుడు ట్వీట్‌లో పేర్కొన్నారు.
Updated Date - 2020-10-01T17:12:23+05:30 IST